సారాంశం
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel)ప్రారంభించిన దాడులు, వాటికి ప్రతీకారంగా ఆ దేశం చేస్తున్న ప్రతిదాడుల్లో పశ్చిమాసియా రావణకాష్టంలా మారుతోంది. దీంతో ఇన్నాళ్లూ గల్ఫ్ దేశాలు సురక్షితమని భావించి ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టిన అమెరికా సంస్థలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత పశ్చిమాసియాలో అమెరికా ఆస్తుల్లో ఏ ఒక్క దాన్నీ వదిలిపెట్టబోమని హెచ్చరించిన ఇరాన్ అన్నంత పనీ చేస్తోంది. ఇదే క్రమంలో రెండు గల్ఫ్ దేశాల్లోని అమెజాన్ డేటా సెంటర్ల (amazon data centres)పై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో UAE, Bahrainలోని అమెజాన్ డేటా సెంటర్లు భారీగా దెబ్బతినడంతో పాటు మంటలు కూడా చెలరేగినట్లు ఇవాళ ఆ సంస్థ వెల్లడించింది.. ఈ మేరకు ఇవి అందిస్తున్న సేవల్లో అంతరాయాలు కొనసాగుతాయని ప్రకటించింది.
3 మార్చి, 2026 01:32 PMకి