ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మరణానికి సంబంధించిన కేసును సింగపూర్ పోలీసులు క్లోజ్ చేశారు. ఆయన మృతిలో ఎటువంటి కుట్ర లేదని విచారణలో స్పష్టమైంది. * సుదీర్ఘ విచారణ అనంతరం జుబీన్ మరణం సహజమైనదేనని, ఇందులో ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని సింగపూర్ పోలీస్ ఫోర్స్ ప్రకటించింది. * దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో ఈ కేసును అధికారికంగా ముగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సంబంధిత వార్తలు
అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది చిన్నారులు బలి
అమెరికాలోని లూసియానాలో కాల్పుల కలకలం రేగింది. రద్దీ ప్రాంతంలో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో 8 మంది పిల్లలు మృతి చెందారు. మృతుల వయసు 1 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్నట్లు ష్రీవ్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం నిందితుడు కారు దొంగిలించి పారిపోవడానికి యత్నించగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్టు తెలిపారు.
మలి విడత చర్చలకు రెడీ అవుతున్న ఇరాన్, అమెరికా
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పాకిస్థాన్ లో మలి విడత చర్చలకు రంగం సిద్ధం అవుతోంది. ట్రంప్ రెచ్చ గొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చల ప్రక్రియపై అందరి దృష్టీ కేంద్రీకృతం అయి ఉంది. అమెరికా ప్రతినిధులు సోమవారం పాక్ చేరుకుంటారని భావిస్తున్నారు. ఇరాన్ ప్రతినిధుల రాకపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే.. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అంగీకరించక పోతే భారీ వినాశనం తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు.

కర్నూలులో దారుణం..హాస్పిటల్ బెడ్‌పై బాలింతను చంపిన భర్త
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ బెడ్‌పై బాలింతగా ఉన్న భార్యను భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. విచక్షణారహితంగా పొడవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కత్తితో పొడిచిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా
నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.
.jpg)