విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులను అధికారులు పరిశీలించారు. ప్రజల నుంచి, సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అవసరమైన అన్ని ఫైళ్లను డౌన్‌లోడ్ చేసి పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు. అక్రమాలు బయటపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విచారణ అనంతరం పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు
-1.png)
ఎన్‌జీవో ముసుగులో దారుణాలు.. మహిళలపై వేధింపులు
నాగ్‌పూర్‌లో ఎన్‌జీవో ముసుగులో మత మార్పిడిలకు పాల్పడుతున్న రియాజ్ కాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సంస్థలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించాలని, మతం మారాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏటీఎస్ లోతుగా విచారణ చేస్తోంది.

KALESWARAM CASE : 22న హైకోర్టు తీర్పు… ADVCతో హరీష్ భేటీ
మాజీ మంత్రి హరీష్ రావు.. న్యాయ నిపుణులను, న్యాయవాదులతో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కేసీఆర్, హరీష్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఏప్రిల్ 22న తన తీర్పును వెలువరించనుంది. కేసీఆర్, హరీష్‌లు కాళేశ్వరంపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికను కోర్టులో సవాలు చేశారు.
-2.jpg)
కన్నపిల్లలనే కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఒక తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. తన ముగ్గురు కుమారులను వరుసగా నిలబెట్టి రైఫిల్‌తో కాల్చి చంపి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. పారిపోవడానికి ప్రయత్నించిన ఒక కుమారుడిని వెంటాడి పట్టుకుని మరీ కాల్పులు జరపడం అతడి క్రూరత్వానికి పరాకాష్ట. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి తన బిడ్డలను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు.

కొండపైనుంచి బస్సు బోల్తా.. 15 మంది మృతి!
Jk ఉధంపుర్ జిల్లాలో ప్యాసింజర్ బస్సు అదుపుతప్పి కొండపై నుంచి దొర్లుతూ లోయలో పడిపోవడంతో 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ మారుమూల గ్రామం నుంచి ప్రయాణికులతో ఉధంపుర్ వెళ్తుండగా కాగోర్ట్ సమీపంలోని మలుపు వద్ద బస్సు ప్రమాదానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.