హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఫామ్ హౌస్ లో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో ఫామ్ హౌస్ ఆకస్మిక దాడులు నిర్వహించారు ఎస్ ఓటీ పోలీసులు. ఫామ్ హౌస్ ప్రాంగణంలో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్న వాచ్ మెన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ కి చెందిన మాతా బాదల్ ఫామ్ హౌస్ కి వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా ఫామ్ హౌస్ ప్రాంగణంలో రహస్యంగా గంజాయి మొక్కను పెంచుతున్నాడు మాతా బాదల్. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఫామ్ హౌస్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మాతా బాదల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని దగ్గర నుంచి 272 గ్రాముల గంజాయి మొక్కను, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు
-1.png)
ఎన్‌జీవో ముసుగులో దారుణాలు.. మహిళలపై వేధింపులు
నాగ్‌పూర్‌లో ఎన్‌జీవో ముసుగులో మత మార్పిడిలకు పాల్పడుతున్న రియాజ్ కాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సంస్థలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించాలని, మతం మారాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏటీఎస్ లోతుగా విచారణ చేస్తోంది.

KALESWARAM CASE : 22న హైకోర్టు తీర్పు… ADVCతో హరీష్ భేటీ
మాజీ మంత్రి హరీష్ రావు.. న్యాయ నిపుణులను, న్యాయవాదులతో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కేసీఆర్, హరీష్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఏప్రిల్ 22న తన తీర్పును వెలువరించనుంది. కేసీఆర్, హరీష్‌లు కాళేశ్వరంపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికను కోర్టులో సవాలు చేశారు.
-2.jpg)
కన్నపిల్లలనే కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఒక తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. తన ముగ్గురు కుమారులను వరుసగా నిలబెట్టి రైఫిల్‌తో కాల్చి చంపి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. పారిపోవడానికి ప్రయత్నించిన ఒక కుమారుడిని వెంటాడి పట్టుకుని మరీ కాల్పులు జరపడం అతడి క్రూరత్వానికి పరాకాష్ట. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి తన బిడ్డలను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు.

కొండపైనుంచి బస్సు బోల్తా.. 15 మంది మృతి!
Jk ఉధంపుర్ జిల్లాలో ప్యాసింజర్ బస్సు అదుపుతప్పి కొండపై నుంచి దొర్లుతూ లోయలో పడిపోవడంతో 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ మారుమూల గ్రామం నుంచి ప్రయాణికులతో ఉధంపుర్ వెళ్తుండగా కాగోర్ట్ సమీపంలోని మలుపు వద్ద బస్సు ప్రమాదానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.