కాశ్మీర్ రాష్ట్రంలో ఇరాన్‌కు మద్దతుగా విరాళాల వెల్లువ కనిపిస్తోంది. యుద్ధ ప్రభావిత ఇరాన్‌కు సహాయం అందించేందుకు కశ్మీర్ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మహిళలు నగదు, బంగారం, పాత్రలు విరాళంగా ఇస్తుండగా… కొందరు పశువులనే అందిస్తున్నారు. పిల్లలు కూడా తమ పొదుపు డబ్బు, ఈద్ కానుకలను విరాళంగా ఇస్తుండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. శ్రీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో మేళాలు నిర్వహిస్తూ విరాళాలు సేకరిస్తున్నారు. ఈ సహాయంపై ఇరాన్ రాయబార కార్యాలయం కశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది.
సంబంధిత వార్తలు

రేవంత్ కు విందుపై విమర్శలు..కేంద్రమంత్రి క్లారిటీ
131వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన రేవంత్‌కి...కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విందు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై వర్మ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు తమ శాఖ నుంచి 2,500 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు కోసం ఆమోదం తెలిపామని..వాటిని త్వరగా విడుదల చేయాలని రేవంత్ రెడ్డి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారన్నారు. అలాగనే అల్పాహార విందుకు హాజరయ్యారని స్పష్టం చేశారు.

బెంగాల్ లో ప్రచారం.. మరమరాల మిక్చర్ తిన్న మోడీ
పశ్చిమబెంగాల్ ను గెలిచేందుకు బీజేపీ అన్ని అస్త్రాలు సంధిస్తోంది. మోడీ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. పురూలియా, ఝార్‌గ్రామ్, మేదినీపూర్, బిష్ణుపూర్‌లలో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు . ప్రచారానంతరం ఝూర్‌గ్రామ్‌లోని ఒక చిన్న దుకాణంలో రుచిరకమైన మరమరాలు తింటూ కొద్దిసేపు అక్కడి స్థానికులతో మమేకమయ్యారు. ప్రధాని వారిని నవ్వుతూ పలకరిస్తూ స్నాక్స్‌ను పంచారు.ఆ క్షణాలను ప్రధాని ఎక్స్ లో షేర్ చేశారు.

విజయ్ పార్టీ కోసం తిరుమలలో ప్రచారం..భక్తుల ఆగ్రహం
తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యక్రమాలు , వ్యాఖ్యలు, రీల్చ్ చేయటం తిరుమలలో నిషేధం. అయితే తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు తిరుమలలో ఎన్నికల ప్రచారం నిర్వహించటం విమర్శలకు తావిచ్చింది. నాదనీరాజనం వద్ద టీవీకే పార్టీ సింబల్ అయిన విజిల్ వేస్తూ విజయ్ టీవీకే పార్టీకి ఓటేయాలని ఆ మహిళ కోరుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై భక్తులు మండిపడుతున్నారు.

డీఎంకే చెన్నై సూపర్-6 స్పెషల్ మేనిఫెస్టో
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డీఎంకే దూకుడు పెంచింది. చెన్నై నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన డీఎంకే...ద్రావిడన్ మోడల్ 2.0" కింద 'చెన్నై సూపర్-6' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళా సంఘాల భాగస్వామ్యంతో గృహ వసతి ప్రాజెక్టుల ఆధునీకరణ, చివరి మైలు వరకు నిరంతర కనెక్టివిటీ సహా కీలక హామీలు ఇచ్చింది.