అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డీఎంకే దూకుడు పెంచింది. చెన్నై నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన డీఎంకే...ద్రావిడన్ మోడల్ 2.0" కింద 'చెన్నై సూపర్-6' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళా సంఘాల భాగస్వామ్యంతో గృహ వసతి ప్రాజెక్టుల ఆధునీకరణ, చివరి మైలు వరకు నిరంతర కనెక్టివిటీ సహా కీలక హామీలు ఇచ్చింది.
సంబంధిత వార్తలు

శాటిలైట్ ఫోన్లతో పట్టుబడ్డ అమెరికన్స్
ఇద్దరు అమెరికా పౌరులు శ్రీనగర్ ఎయిర్ పోర్టులో శాటిలైట్ ఫోన్లు తీసుకెళ్తూ దొరికారు. విమానాశ్రయ భద్రతా సిబ్బంది వారిని ప్రశ్నించి, తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించారు. దీంతో ఈ వ్యవహారం భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా భారత్ లో శాటిలైట్ ఫోన్‌ల వాడకంపై నిషేధం ఉంది.
తప్పదు.. ఓట్లు కావాలంటే మోకాళ్ళపై నడవాల్సిందే..
చర్చిలో మోకాళ్లపై నడుస్తూ టీవీకే చీఫ్ విజయ్ ప్రార్థనలు చేశారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన తిరుచిరాపల్లిలో సర్వమత పూజల్లో పాల్గొన్నారు. ముందుగా చర్చికి వెళ్లి మోకాళ్లపై నడుస్తూ ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదుకు వెళ్లి ముస్లింల ఆశీర్వాదాలు పొందారు. మరి ఆయన ప్రార్తనలు ఫలిస్తాయో లేదో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
టీఎంసీకి మహిళల శిక్ష తప్పదు: మోడీ
పార్లమెంట్ లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడాన్ని ఎన్నికల అస్త్రంగా మల్చుకుంది బీజేపీ. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కాంగ్రెస్‌తో కుమ్మక్కై మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదాన్ని అడ్డుకుందని మోడీ మండిపడ్డారు. టీఎంసీని అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలే శిక్షిస్తారని అన్నారు. బెంగాల్‌లోని బిష్ణుపుర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ మేరకు మోడీ వ్యాఖ్యానించారు.

బెంగాల్ లో 7 లక్షల కొత్త ఓటర్లు
పశ్చిమ బెంగాల్ లో పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటరు జాబితాలో సీఈసీ సుమారు ఏడు లక్షల కొత్త ఓటర్లను చేర్చింది. అయితే, ఈ అదనపు ఓటర్ల వయసు, వారు పురుష లేదా మహిళా ఓటర్లా అనే విషయాన్ని సీఈసీ వెల్లడించకపోవడం గమనార్హం. అలాగే ఓటర్ల జాబితాలో చేర్చడం కోసం అందిన ఫారం-6 దరఖాస్తుల సంఖ్యను గానీ, వాటిలో ఎన్ని తిరస్కరణకు గురయ్యో అనే విషయాన్నీ వెల్లడించలేదు.
