
మినిమమ్ బ్యాలెన్స్ జరిమానాలు.. 3 ఏళ్లలో బ్యాంకులకు ₹19 వేల కోట్లు
సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిల్వ ఉంచకపోవడంతో బ్యాంకులు కస్టమర్ల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రైవేట్ బ్యాంకులు సుమారు ₹11,000 కోట్లకు పైగా మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు వసూలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా దాదాపు ₹8,000 కోట్ల వరకు వసూలు చేశాయి. దీంతో మొత్తం కలిపి సుమారు ₹19,000 కోట్లకు పైగా బ్యాంకులకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వసూళ్లలో HDFC బ్యాంక్ అత్యధికంగా ₹3,800 కోట్లకు పైగా సేకరించింది. తరువాత Axis Bank, ICICI Bank ఉన్నాయి. అయితే SBI వంటి కొన్ని ప్రభుత్వ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ జరిమానాలను ఇప్పటికే రద్దు చేశాయి. జన్ ధన్ వంటి బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించవు.
సంబంధిత వార్తలు
-1.png)
ఎన్‌జీవో ముసుగులో దారుణాలు.. మహిళలపై వేధింపులు
నాగ్‌పూర్‌లో ఎన్‌జీవో ముసుగులో మత మార్పిడిలకు పాల్పడుతున్న రియాజ్ కాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సంస్థలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించాలని, మతం మారాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏటీఎస్ లోతుగా విచారణ చేస్తోంది.

KALESWARAM CASE : 22న హైకోర్టు తీర్పు… ADVCతో హరీష్ భేటీ
మాజీ మంత్రి హరీష్ రావు.. న్యాయ నిపుణులను, న్యాయవాదులతో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కేసీఆర్, హరీష్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఏప్రిల్ 22న తన తీర్పును వెలువరించనుంది. కేసీఆర్, హరీష్‌లు కాళేశ్వరంపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికను కోర్టులో సవాలు చేశారు.
-2.jpg)
కన్నపిల్లలనే కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఒక తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. తన ముగ్గురు కుమారులను వరుసగా నిలబెట్టి రైఫిల్‌తో కాల్చి చంపి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. పారిపోవడానికి ప్రయత్నించిన ఒక కుమారుడిని వెంటాడి పట్టుకుని మరీ కాల్పులు జరపడం అతడి క్రూరత్వానికి పరాకాష్ట. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి తన బిడ్డలను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు.

కొండపైనుంచి బస్సు బోల్తా.. 15 మంది మృతి!
Jk ఉధంపుర్ జిల్లాలో ప్యాసింజర్ బస్సు అదుపుతప్పి కొండపై నుంచి దొర్లుతూ లోయలో పడిపోవడంతో 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ మారుమూల గ్రామం నుంచి ప్రయాణికులతో ఉధంపుర్ వెళ్తుండగా కాగోర్ట్ సమీపంలోని మలుపు వద్ద బస్సు ప్రమాదానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.