యుద్ధం కారణంగా పశ్చిమాసియా మీదుగా ప్రయాణించే విమాన మార్గాలను సోమవారం నుంచి మూసివేస్తున్నట్లు పలు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ ప్రకటించాయి. ఎయిర్ ఇండియా, లుఫ్తాన్సా మరియు ఎమిరేట్స్ వంటి సంస్థలు టెహ్రాన్ మరియు టెల్ అవీవ్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో ప్రయాణ సమయం మరియు టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ప్రయాణికులు తమ విమాన సమయాలను ముందే సరిచూసుకోవాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఆంక్షలు యుద్ధం తగ్గే వరకు కొనసాగే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
.jpg)
ఇరాన్‌కు అమెరికా చుక్కలు: ప్రపంచవ్యాప్తంగా నౌకల సీజ్..
హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు అమెరికా ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకలు ,చమురు ట్యాంకర్లు కనిపిస్తే వాటిని సీజ్ చేయాలని పెంటగాన్ యోచిస్తోంది. ఇరాన్ పోర్టులను ఇప్పటికే దిగ్బంధించిన అమెరికా, హర్మూజ్ వద్ద 23 నౌకలను అడ్డుకుని తనిఖీలు చేపట్టింది.ఈ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదంఉంది.

ఇంతకీ హార్మూజ్ ఓపెన్ కాలేదా..??
హార్మూజ్ జల సంధి ఓపెన్ అయ్యింది అని అమెరికా చెబుతున్నప్పటికీ, ప్రపంచ దేశాలు పూర్తిగా నమ్మడం లేదు. అక్కడినుంచి ప్రయాణిస్తున్న కమర్షియల్ నౌకలు చాలా జాగ్రత్తగా కదులుతున్నట్లు తెలుస్తోంది. సముద్ర గర్భంలో సీ మైన్స్. ప్రమాదం దృష్ట్యా ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటున్నారు. అందుచేత పూర్తిగా ట్రాఫిక్ ఊపందుకునేందుకు సమయం పట్టేటట్లుంది.

ఎప్పుడూ సంక్షోభంలోనే లెబనాన్.. కారణాలివే!
లెబనాన్ తరచూ సంక్షోభాల్లో చిక్కుకోవడానికి అనేక కారణాలున్నాయి. క్లిష్టమైన భౌగోళిక, రాజకీయ పరిస్థితులు దేశాన్ని అస్థిరతలోకి నెట్టేస్తున్నాయని బీరుట్ బ్యూరో చీఫ్ మాయా గెబీలీ తెలిపారు. మంచి పొరుగు దేశాలు లేవని అత్యధిక లెబనీస్ ప్రజలు భావన. వీటికి తోడు దేశంలో తీవ్ర అంతర్గత రాజకీయ విభేదాలు, భారీ ఆర్థిక సంక్షోభం, ప్రాంతీయ ఉద్రిక్తతలు అన్నీ కలగలిపి లెబనాన్ పరిస్థితిని క్లిష్టంగా మార్చేస్తున్నాయి.

ట్రంప్ కామెడీ మామూలుగా లేదుగా..!!
నిన్నటిదాకా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లాక్కొనే దాకా తగ్గేది లేదు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంకెలు వేశారు. ఇప్పుడు సడన్ గా మాట మార్చేశారు. అణు పదార్థాలను ఏరి వేసేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తామంటూ ప్రేమ గీతాలు పాడుతున్నారు.
