పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ప్రభావం ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పై పడింది. బహ్రెయిన్ రీజియన్‌లోని తమ వెబ్ సర్వీసెస్ లో సాంకేతిక అంతరాయం ఏర్పడినట్లు సంస్థ వెల్లడించింది. ఆ ప్రాంతంలో జరుగుతున్న డ్రోన్ దాడుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.దీనివల్ల ఇంటర్నెట్ సేవలకు ఆటంకం కలగడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితిని గమనించిన అమెజాన్, తమ సేవలను ప్రత్యామ్నాయ ప్రాంతాల్లోని సర్వర్లకు మళ్లించే ప్రయత్నం చేస్తోంది.
సంబంధిత వార్తలు

భారత్–దక్షిణ కొరియా వ్యూహాత్మక భాగస్వామ్యం
భారత్–దక్షిణ కొరియా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత పర్యటనకు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ కు.. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, PM మోదీ ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో సహకారం పెంపుపై దృష్టి సారించే అవకాశముంది.

తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి రేటు
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.
.png)
వణికిపోయిన ప్యాసింజర్స్.. ఫ్లై91లో ఏం జరిగింది?
హైదరాబాద్ నుంచి హుబ్బళ్లి వెళ్లాల్సిన ఫ్లై91 విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్య, వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరుకు దారి మళ్లించారు. దాదాపు 3 గంటల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. చివరకు అందరూ సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.

నియమాలు పాటిద్దాం - ప్రమాదాలను నివారిద్దాం.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ISI మార్కు ఉన్న హెల్మెట్ ధరించాలి. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం లేదా మెసేజ్ చేయడం వంటివి ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. రోడ్డు దాటేటప్పుడు ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్ మాత్రమే ఉపయోగించండి.
.png)