LIVE
America Iron
వెనక్కి
International

అమెరికా కు ఇరాన్ ఝలక్

29 రోజుల క్రితం
సారాంశం

హిందూ మహాసముద్రంలో ఉన్న అత్యంత కీలకమైన డియెగో గార్సియా ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రధాన భూభాగం నుండి దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరాన్ని లక్ష్యం చేసుకొంది. ఈ క్షిపణులు లక్ష్యాన్ని చేరలేక సముద్రంలో పడిపోయినప్పటికీ, ఇరాన్ తన క్షిపణి పరిధిని ఎంతలా పెంచుకుందో ఈ ఘటన నిరూపిస్తోంది. ఇది ఆసియా ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక భద్రతకు పెను సవాలుగా మారింది. ఎందుకంటే ఈ స్థావరం చాలా కాలంగా అమెరికా బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం గా నిలుస్తోంది.

షేర్ చేయండి:
21 మార్చి, 2026 04:11 PMకి

సంబంధిత వార్తలు

ఇరాన్‌కు అమెరికా చుక్కలు: ప్రపంచవ్యాప్తంగా నౌకల సీజ్..

ఇరాన్‌కు అమెరికా చుక్కలు: ప్రపంచవ్యాప్తంగా నౌకల సీజ్..

హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు అమెరికా ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకలు ,చమురు ట్యాంకర్లు కనిపిస్తే వాటిని సీజ్ చేయాలని పెంటగాన్ యోచిస్తోంది. ఇరాన్ పోర్టులను ఇప్పటికే దిగ్బంధించిన అమెరికా, హర్మూజ్ వద్ద 23 నౌకలను అడ్డుకుని తనిఖీలు చేపట్టింది.ఈ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదంఉంది.

8 గంటల క్రితం
ఇంతకీ హార్మూజ్ ఓపెన్ కాలేదా..??

ఇంతకీ హార్మూజ్ ఓపెన్ కాలేదా..??

హార్మూజ్ జల సంధి ఓపెన్ అయ్యింది అని అమెరికా చెబుతున్నప్పటికీ, ప్రపంచ దేశాలు పూర్తిగా నమ్మడం లేదు. అక్కడినుంచి ప్రయాణిస్తున్న కమర్షియల్ నౌకలు చాలా జాగ్రత్తగా కదులుతున్నట్లు తెలుస్తోంది. సముద్ర గర్భంలో సీ మైన్స్. ప్రమాదం దృష్ట్యా ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటున్నారు. అందుచేత పూర్తిగా ట్రాఫిక్ ఊపందుకునేందుకు సమయం పట్టేటట్లుంది.

9 గంటల క్రితం
ఎప్పుడూ సంక్షోభంలోనే లెబనాన్.. కారణాలివే!

ఎప్పుడూ సంక్షోభంలోనే లెబనాన్.. కారణాలివే!

లెబనాన్ తరచూ సంక్షోభాల్లో చిక్కుకోవడానికి అనేక కారణాలున్నాయి. క్లిష్టమైన భౌగోళిక, రాజకీయ పరిస్థితులు దేశాన్ని అస్థిరతలోకి నెట్టేస్తున్నాయని బీరుట్ బ్యూరో చీఫ్ మాయా గెబీలీ తెలిపారు. మంచి పొరుగు దేశాలు లేవని అత్యధిక లెబనీస్ ప్రజలు భావన. వీటికి తోడు దేశంలో తీవ్ర అంతర్గత రాజకీయ విభేదాలు, భారీ ఆర్థిక సంక్షోభం, ప్రాంతీయ ఉద్రిక్తతలు అన్నీ కలగలిపి లెబనాన్ పరిస్థితిని క్లిష్టంగా మార్చేస్తున్నాయి.

9 గంటల క్రితం
ట్రంప్ కామెడీ మామూలుగా లేదుగా..!!

ట్రంప్ కామెడీ మామూలుగా లేదుగా..!!

నిన్నటిదాకా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లాక్కొనే దాకా తగ్గేది లేదు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంకెలు వేశారు. ఇప్పుడు సడన్ గా మాట మార్చేశారు. అణు పదార్థాలను ఏరి వేసేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తామంటూ ప్రేమ గీతాలు పాడుతున్నారు.

10 గంటల క్రితం