LIVE
Download   2026 04 19T154623.116
వెనక్కి
General

బ్లాక్ హోల్ సామర్థ్యం 10వేల సూర్యులతో సమానమా..??

1 గంటల క్రితం
సారాంశం

తాజా రిపోర్ట్ లు అవుననే చెబుతున్నాయి. బ్లాక్ హోల్ దగ్గర ప్రయాణిస్తున్న కాంతిపుంజముల వేగము, కాంతి వేగం లో సగమే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడి నుంచి వెలువడే కాంతి... పదివేల సూర్యులు వెదజల్లే కాంతితో సమానం అని లెక్క గడుతున్నారు.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 03:45 PMకి

సంబంధిత వార్తలు

మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..

మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎల్బీ నగర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, బాచుపల్లి , మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడటంతో , ఎండ లతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల అకస్మాత్తుగ ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

5 నిమిషాల క్రితం
జగనన్న కాలనీలో చొరబడ్డ చిరుత..

జగనన్న కాలనీలో చొరబడ్డ చిరుత..

చిత్తూరు నగర నడిబొడ్డున చిరుతల సంచారం కలకలం రేపుతోంది. దొడ్డిపల్లిలోని జగనన్న లేఔట్‌లో మూడు రోజులుగా తిరుగుతున్న చిరుత గాయాలపాలై స్పృహ తప్పి పడిపోయింది. తిరుపతి నుంచి రావాల్సిన రెస్క్యూ బృందం కోసం అటవీ శాఖ ఎదురుచూస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పరిసరాలను ఖాళీ చేయించారు. చిరుతను చూసేందుకు ప్రజలుఎగబడ్డారు. మరోవైపు స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

17 నిమిషాల క్రితం
బాలాపూర్‌లో అగ్నిప్రమాదం

బాలాపూర్‌లో అగ్నిప్రమాదం

బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ప్లాస్టిక్ షాపుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, వాటిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

36 నిమిషాల క్రితం
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తమన్నా

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తమన్నా

హీరోయిన్ తమన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందంటూ...తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలో ఆమె గులాబీ రంగు సంప్రదాయ దుస్తులు, ఎరుపు రంగు దుపట్టాతో ఆలయం వెలుపల కనిపించారు. అంతకుముందు, తిరుమలకు కారులో ప్రయాణిస్తున్న వీడియోను కూడా ఆమె షేర్ చేశారు.

42 నిమిషాల క్రితం