రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచకు చెందిన కేసీఆర్ వీరాభిమాని, ఉద్యమకారిణి తెలంగాణ సత్తెమ్మ కన్నుమూశారు. అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమె.. కేటీఆర్ పాల్గొనే ప్రతి సభలో తన నినాదాలతో ఉత్సాహం నింపేవారు. మిడ్ మానేరు ముంపుతో సత్తెమ్మ ఇల్లు కోల్పోగా, కేటీఆర్ రగుడులో డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇచ్చి అండగా నిలిచారు.
సంబంధిత వార్తలు
మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎల్బీ నగర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, బాచుపల్లి , మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడటంతో , ఎండ లతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల అకస్మాత్తుగ ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇంతకీ పవన్ కళ్యాణ్ కి జరిగిన ఆపరేషన్ ఏమిటి.. అంతా ఓకే నా .. ??
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సైనసైటిస్ ఆపరేషన్ జరిగింది. అంటే సైనస్ నాళం లోకి ఎండోస్కోపీ ద్వారా పైప్ పంపించి ఇన్ఫెక్షన్ క్లియర్ చేశారు. సింపుల్ ప్రొసీజర్ కాబట్టి ఆ రోజే డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సెక్స్ కేసులో ఇరుక్కున్న బిజెపి నేత పుత్రరత్నం
ఉత్తర ప్రదేశ్ బిజెపి మాజీ మంత్రి నియర్ కుమార్ కుమారుడు రఘువంశీ అరెస్టు అయ్యారు. ముజఫర్ నగర్ లో ఒక మహిళను లైంగికంగా వేదించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. నీతులు చెప్పే బిజెపి నేతల వాస్తవ రూపం ఇదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

BREAKING: టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కట్టనార్‌పట్టి సమీపంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రసాయనాలు కలుపుతున్న సమయంలో ఘర్షణ జరగడం వల్లే ఈ పేలుడు సంభవించిందని నిర్ధారించారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
