LIVE
1200 675 26508129 Thumbnail 16x9 Modi
వెనక్కి
National

టీఎంసీకి మహిళల శిక్ష తప్పదు: మోడీ

6 గంటల క్రితం
సారాంశం

పార్లమెంట్ లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడాన్ని ఎన్నికల అస్త్రంగా మల్చుకుంది బీజేపీ. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కాంగ్రెస్‌తో కుమ్మక్కై మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదాన్ని అడ్డుకుందని మోడీ మండిపడ్డారు. టీఎంసీని అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలే శిక్షిస్తారని అన్నారు. బెంగాల్‌లోని బిష్ణుపుర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ మేరకు మోడీ వ్యాఖ్యానించారు.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 04:22 PMకి

సంబంధిత వార్తలు

రేవంత్ కు విందుపై విమర్శలు..కేంద్రమంత్రి క్లారిటీ

రేవంత్ కు విందుపై విమర్శలు..కేంద్రమంత్రి క్లారిటీ

131వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన రేవంత్‌కి...కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విందు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై వర్మ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు తమ శాఖ నుంచి 2,500 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు కోసం ఆమోదం తెలిపామని..వాటిని త్వరగా విడుదల చేయాలని రేవంత్ రెడ్డి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారన్నారు. అలాగనే అల్పాహార విందుకు హాజరయ్యారని స్పష్టం చేశారు.

40 నిమిషాల క్రితం
బెంగాల్ లో ప్రచారం.. మరమరాల మిక్చర్ తిన్న మోడీ

బెంగాల్ లో ప్రచారం.. మరమరాల మిక్చర్ తిన్న మోడీ

పశ్చిమబెంగాల్ ను గెలిచేందుకు బీజేపీ అన్ని అస్త్రాలు సంధిస్తోంది. మోడీ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. పురూలియా, ఝార్‌గ్రామ్, మేదినీపూర్, బిష్ణుపూర్‌లలో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు . ప్రచారానంతరం ఝూర్‌గ్రామ్‌లోని ఒక చిన్న దుకాణంలో రుచిరకమైన మరమరాలు తింటూ కొద్దిసేపు అక్కడి స్థానికులతో మమేకమయ్యారు. ప్రధాని వారిని నవ్వుతూ పలకరిస్తూ స్నాక్స్‌ను పంచారు.ఆ క్షణాలను ప్రధాని ఎక్స్ లో షేర్ చేశారు.

46 నిమిషాల క్రితం
విజయ్ పార్టీ కోసం తిరుమలలో ప్రచారం..భక్తుల ఆగ్రహం

విజయ్ పార్టీ కోసం తిరుమలలో ప్రచారం..భక్తుల ఆగ్రహం

తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యక్రమాలు , వ్యాఖ్యలు, రీల్చ్ చేయటం తిరుమలలో నిషేధం. అయితే తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు తిరుమలలో ఎన్నికల ప్రచారం నిర్వహించటం విమర్శలకు తావిచ్చింది. నాదనీరాజనం వద్ద టీవీకే పార్టీ సింబల్ అయిన విజిల్ వేస్తూ విజయ్ టీవీకే పార్టీకి ఓటేయాలని ఆ మహిళ కోరుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై భక్తులు మండిపడుతున్నారు.

57 నిమిషాల క్రితం
డీఎంకే చెన్నై సూపర్-6 స్పెషల్ మేనిఫెస్టో

డీఎంకే చెన్నై సూపర్-6 స్పెషల్ మేనిఫెస్టో

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డీఎంకే దూకుడు పెంచింది. చెన్నై నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన డీఎంకే...ద్రావిడన్ మోడల్ 2.0" కింద 'చెన్నై సూపర్-6' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళా సంఘాల భాగస్వామ్యంతో గృహ వసతి ప్రాజెక్టుల ఆధునీకరణ, చివరి మైలు వరకు నిరంతర కనెక్టివిటీ సహా కీలక హామీలు ఇచ్చింది.

4 గంటల క్రితం