
DENGER BELLS : మరో జలసంధిని మూసివేస్తాం: హుతీలు
అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ హర్మూజ్‌ను మూసివేయడంతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. తాజాగా సూయజ్ కెనాల్‌కు వెళ్లే మార్గంలోని మరో జలసంధిని మూసివేస్తామని యెమెన్ హూతీలు హెచ్చరించారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను USA ట్రంప్ కొనసాగిస్తే తాము బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించారు. హుతీల తాజా ప్రకటనతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.
సంబంధిత వార్తలు

జాల్మూరి టేస్ట్ అదిరిందన్న ప్రధాని..
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న ప్రధాని మోదీ మధ్యలో కాస్త విరామం తీసుకుని జార్గ్రామ్‌లో జాల్మురి రుచి చూశారు. వరుసగా4 ర్యాలీల మధ్య స్థానిక ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా గడిపినట్లు తన ఎక్స్ హ్యాండిల్‌లో వెల్లడించారు. జాల్మురి అనేది బెంగాలీలు ఇష్టంగా తినే స్నాక్. ముర్మురేలు, మసాలాలు, ఉల్లిపాయ, మిర్చితో తయారై కారంగా ఉండే ఈ స్నాక్ తనకు చాలా ఇష్టమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎల్బీ నగర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, బాచుపల్లి , మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడటంతో , ఎండ లతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల అకస్మాత్తుగ ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

BREAKING: టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కట్టనార్‌పట్టి సమీపంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రసాయనాలు కలుపుతున్న సమయంలో ఘర్షణ జరగడం వల్లే ఈ పేలుడు సంభవించిందని నిర్ధారించారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

జగనన్న కాలనీలో చొరబడ్డ చిరుత..
చిత్తూరు నగర నడిబొడ్డున చిరుతల సంచారం కలకలం రేపుతోంది. దొడ్డిపల్లిలోని జగనన్న లేఔట్‌లో మూడు రోజులుగా తిరుగుతున్న చిరుత గాయాలపాలై స్పృహ తప్పి పడిపోయింది. తిరుపతి నుంచి రావాల్సిన రెస్క్యూ బృందం కోసం అటవీ శాఖ ఎదురుచూస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పరిసరాలను ఖాళీ చేయించారు. చిరుతను చూసేందుకు ప్రజలుఎగబడ్డారు. మరోవైపు స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.