LIVE
Images (1) 4
వెనక్కి
Crime

జెరూసలెం సమీపంలో క్లస్టర్ బాంబుల శకలాలు?.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఆరోపణ

40 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

ఇరాన్ ఇటీవల జరిపిన క్షిపణి దాడుల్లో క్లస్టర్ బాంబులు ఉపయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం (IDF) ఆరోపించింది. కొన్ని బాలిస్టిక్ క్షిపణుల్లో క్లస్టర్ వార్‌హెడ్‌లు అమర్చినట్లు తమకు ఆధారాలు లభించాయని తెలిపింది. ఈ దాడుల సమయంలో జెరూసలెం, టెల్ అవీవ్ ప్రాంతాల్లో అలారం సైరన్లు మోగగా, క్షిపణుల శకలాలు పలు ప్రాంతాల్లో పడినట్లు అధికారులు వెల్లడించారు. క్లస్టర్ వార్‌హెడ్‌లు పేలినప్పుడు చిన్న చిన్న బాంబులు అనేక దిశల్లో చెలరేగుతాయని, అవి విస్తృత ప్రాంతంలో నష్టం కలిగించే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఘటనల్లో గాయాలూ నమోదైనట్లు సమాచారం.

షేర్ చేయండి:
11 మార్చి, 2026 11:14 AMకి

సంబంధిత వార్తలు

RED SALUTE: ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలకు 45 ఏండ్లు!

RED SALUTE: ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలకు 45 ఏండ్లు!

ADB జిల్లా ఇంద్రవెల్లి పోలీసు కాల్పులకు నేటితో 45 ఏళ్లు నిండాయి. భూమి, అటవీ హక్కుల సాధన కోసం 1981 ఏప్రిల్ 20న గిరిజనులు సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవ కాల్పులకు దారితీయగా 300 మందికి పైగా అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోగా, అధికారులు 13 మంది చనిపోయారని చెప్పారు. హక్కుల కోసం అసువులుబాసిన ఆ వీరులకు ఏటా ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తారు.

13 నిమిషాల క్రితం
ఎన్‌జీవో ముసుగులో దారుణాలు.. మహిళలపై వేధింపులు

ఎన్‌జీవో ముసుగులో దారుణాలు.. మహిళలపై వేధింపులు

నాగ్‌పూర్‌లో ఎన్‌జీవో ముసుగులో మత మార్పిడిలకు పాల్పడుతున్న రియాజ్ కాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సంస్థలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించాలని, మతం మారాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏటీఎస్ లోతుగా విచారణ చేస్తోంది.

16 నిమిషాల క్రితం
KALESWARAM CASE : 22న హైకోర్టు తీర్పు… ADVCతో హరీష్ భేటీ

KALESWARAM CASE : 22న హైకోర్టు తీర్పు… ADVCతో హరీష్ భేటీ

మాజీ మంత్రి హరీష్ రావు.. న్యాయ నిపుణులను, న్యాయవాదులతో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కేసీఆర్, హరీష్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఏప్రిల్ 22న తన తీర్పును వెలువరించనుంది. కేసీఆర్, హరీష్‌లు కాళేశ్వరంపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికను కోర్టులో సవాలు చేశారు.

26 నిమిషాల క్రితం
కన్నపిల్లలనే కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!

కన్నపిల్లలనే కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఒక తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. తన ముగ్గురు కుమారులను వరుసగా నిలబెట్టి రైఫిల్‌తో కాల్చి చంపి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. పారిపోవడానికి ప్రయత్నించిన ఒక కుమారుడిని వెంటాడి పట్టుకుని మరీ కాల్పులు జరపడం అతడి క్రూరత్వానికి పరాకాష్ట. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి తన బిడ్డలను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు.

28 నిమిషాల క్రితం