ఇటలీలోని బెర్గామో ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. వైశాఖి పండుగ వేడుకల కోసం మాతా సాహిబ్ కౌర్ జీ గురుద్వారాకు వెళ్లిన రాగిందర్ సింగ్, గుర్మీత్ సింగ్ అనే ఇద్దరు భారతీయులు గుర్తు తెలియని దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రార్థనలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది.ఈ ఘటన ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
సంబంధిత వార్తలు

ఇంతకీ హార్మూజ్ ఓపెన్ కాలేదా..??
హార్మూజ్ జల సంధి ఓపెన్ అయ్యింది అని అమెరికా చెబుతున్నప్పటికీ, ప్రపంచ దేశాలు పూర్తిగా నమ్మడం లేదు. అక్కడినుంచి ప్రయాణిస్తున్న కమర్షియల్ నౌకలు చాలా జాగ్రత్తగా కదులుతున్నట్లు తెలుస్తోంది. సముద్ర గర్భంలో సీ మైన్స్. ప్రమాదం దృష్ట్యా ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటున్నారు. అందుచేత పూర్తిగా ట్రాఫిక్ ఊపందుకునేందుకు సమయం పట్టేటట్లుంది.

ఎప్పుడూ సంక్షోభంలోనే లెబనాన్.. కారణాలివే!
లెబనాన్ తరచూ సంక్షోభాల్లో చిక్కుకోవడానికి అనేక కారణాలున్నాయి. క్లిష్టమైన భౌగోళిక, రాజకీయ పరిస్థితులు దేశాన్ని అస్థిరతలోకి నెట్టేస్తున్నాయని బీరుట్ బ్యూరో చీఫ్ మాయా గెబీలీ తెలిపారు. మంచి పొరుగు దేశాలు లేవని అత్యధిక లెబనీస్ ప్రజలు భావన. వీటికి తోడు దేశంలో తీవ్ర అంతర్గత రాజకీయ విభేదాలు, భారీ ఆర్థిక సంక్షోభం, ప్రాంతీయ ఉద్రిక్తతలు అన్నీ కలగలిపి లెబనాన్ పరిస్థితిని క్లిష్టంగా మార్చేస్తున్నాయి.

ట్రంప్ కామెడీ మామూలుగా లేదుగా..!!
నిన్నటిదాకా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లాక్కొనే దాకా తగ్గేది లేదు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంకెలు వేశారు. ఇప్పుడు సడన్ గా మాట మార్చేశారు. అణు పదార్థాలను ఏరి వేసేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తామంటూ ప్రేమ గీతాలు పాడుతున్నారు.

ఉత్తర కొరియా క్షిపణి గర్జన: సియోల్‌లో అత్యవసర భేటీ
ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతూ ఉత్తర కొరియా మరోసారి రెచ్చిపోయింది. తాజాగా సముద్రంలోకి వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి తన పంతాన్ని చాటుకుంది. ఈ ప్రయోగాలతో దక్షిణ కొరియా అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు సియోల్ వెంటనే అత్యవసర భద్రతా సమావేశాన్ని నిర్వహించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.