LIVE
Rains 1 V Jpg  442x260 4g
వెనక్కి
General

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం.. బస్టాండ్‌ వద్ద విరిగిన భారీ వృక్షం

3 గంటల క్రితం
Telangana, Andhra Pradesh
సారాంశం

కామారెడ్డి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, సదాశివనగర్, మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూర్ మండలాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడింది. పలు చోట్ల కల్లాల్లో వరి ధాన్యం తడిసిముద్దయ్యింది. ప్రధాన బస్టాండ్ వద్ద భారీ వృక్షం నేల కొరిగింది. దీంతో బస్టాండ్ లోపలికి బస్సులు వెళ్లేందుకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 05:43 PMకి

సంబంధిత వార్తలు

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్‌గా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు.

2 నిమిషాల క్రితం
ఇరాన్ ఒప్పుకుంటే సరి..లేదంటే నేనేంటో చూపిస్తా: ట్రంప్

ఇరాన్ ఒప్పుకుంటే సరి..లేదంటే నేనేంటో చూపిస్తా: ట్రంప్

తమ ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్‌లోని ప్రతి విద్యుత్ కేంద్రాన్ని, వంతెనను నాశనం చేస్తామంటూ...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య రెండో దఫా చర్చల కోసం రేపు అమెరికా ప్రతినిధి బృందం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లనుంది. తమ ప్రతిపాదనలకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు ట్రంప్. లేకపోతే తానేంటో చూపిస్తానంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

21 నిమిషాల క్రితం
రేపు చంద్రబాబు బర్త్ డే...లోకేష్ సర్ ప్రైజ్

రేపు చంద్రబాబు బర్త్ డే...లోకేష్ సర్ ప్రైజ్

రేపు ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే ను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు భారీగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. చంద్రబాబు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా... ఆయన తనయుడు, మంత్రి లోకేష్ ఒక కామన్ డిస్‌ప్లే పిక్చర్ ని విడుదల చేశారు. ఈ సీడీపీ విడుదలతో టీడీపీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చుకుంటూ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

36 నిమిషాల క్రితం
NDA: దేశమంతా జన ఆక్రోష్.. NDA నిర్ణయం

NDA: దేశమంతా జన ఆక్రోష్.. NDA నిర్ణయం

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో దేశవ్యాప్తంగా జన ఆక్రోస్ ర్యాలీ నిర్వహించేందుకు NDA కూటమి సిద్ధమైంది. మహిళా లోకానికి అన్యాయం చేసే విధంగా ఇండియా కూటమి వ్యవహరించిందని బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్, ఇండియా కూటమి బిల్లు పట్ల వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కూటమి పార్టీలను కలుపుకుని జన ఆక్రోస్ ర్యాలీలు తీయనున్నారు.

1 గంటల క్రితం