మెదక్: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగాసన్ పల్లి తండాకు చెందిన వ్యక్తి తాగుడుకు బానిసై నెల వయసున్న కొడుకును వేరే వారికి అమ్మేశాడు. ఇద్దరు మధ్యవర్తుల ద్వారా బాబును కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సంతానం లేని దంపతులకు అమ్మేశాడు. రూ.5 లక్షలకు బేరం పెట్టగా, చివరకు రూ.1.70 లక్షలకు అగ్రిమెంట్ పేపర్ రాసుకొని బాబును అమ్మేశాడు. ఈ విషయం సోమవారం ఐసీడీఎస్ అధికారుల దృష్టికి వెళ్లగా, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హవేలి ఘనపూర్ ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లాకు వెళ్లి బాబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాబుతో పాటు తల్లిని మెదక్ పట్టణంలోని సఖి కేంద్రానికి తరలించారు. బాలుడిని అమ్మిన వారితో పాటు కొన్నవారు, ఇద్దరు మధ్యవర్తులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
సంబంధిత వార్తలు

RED SALUTE: ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలకు 45 ఏండ్లు!
ADB జిల్లా ఇంద్రవెల్లి పోలీసు కాల్పులకు నేటితో 45 ఏళ్లు నిండాయి. భూమి, అటవీ హక్కుల సాధన కోసం 1981 ఏప్రిల్ 20న గిరిజనులు సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవ కాల్పులకు దారితీయగా 300 మందికి పైగా అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోగా, అధికారులు 13 మంది చనిపోయారని చెప్పారు. హక్కుల కోసం అసువులుబాసిన ఆ వీరులకు ఏటా ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తారు.
-1.png)
ఎన్‌జీవో ముసుగులో దారుణాలు.. మహిళలపై వేధింపులు
నాగ్‌పూర్‌లో ఎన్‌జీవో ముసుగులో మత మార్పిడిలకు పాల్పడుతున్న రియాజ్ కాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సంస్థలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించాలని, మతం మారాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏటీఎస్ లోతుగా విచారణ చేస్తోంది.

KALESWARAM CASE : 22న హైకోర్టు తీర్పు… ADVCతో హరీష్ భేటీ
మాజీ మంత్రి హరీష్ రావు.. న్యాయ నిపుణులను, న్యాయవాదులతో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కేసీఆర్, హరీష్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఏప్రిల్ 22న తన తీర్పును వెలువరించనుంది. కేసీఆర్, హరీష్‌లు కాళేశ్వరంపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికను కోర్టులో సవాలు చేశారు.
-2.jpg)
కన్నపిల్లలనే.. కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఒక తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. తన ముగ్గురు కుమారులను వరుసగా నిలబెట్టి రైఫిల్‌తో కాల్చి చంపి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. పారిపోవడానికి ప్రయత్నించిన ఒక కుమారుడిని వెంటాడి పట్టుకుని మరీ కాల్పులు జరపడం అతడి క్రూరత్వానికి పరాకాష్ట. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి తన బిడ్డలను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు.
