LIVE
Merlin 164776125 9cd4be70 05da 4003 B272 8c8cb5f28cb6 SuperJumbo
వెనక్కి
General

అత్యధిక ఎయిర్ పొల్యూషన్ ఉన్న దేశంగా పాకిస్తాన్

26 రోజుల క్రితం
సారాంశం

ప్రపంచంలోనే ఎయిర్ పొల్యూషన్ అధికంగా ఉన్న దేశాల్లో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన వాయు నాణ్యత పర్యవేక్షణ సంస్థ ఐక్యూఎయిర్ తన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక్కడి గాలిలో ప్రమాదకరమైన సూక్ష్మ రేణువులసాంద్రత డ‌బ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన సురక్షిత స్థాయి కంటే 13 రెట్లు అధికంగా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా 143 దేశాలు, ప్రాంతాల్లో వాయు నాణ్యతను పర్యవేక్షించగా.. వాటిలో 130 దేశాలు డ‌బ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన ప్రమాణాలను అందుకోలేకపోయాయి.

షేర్ చేయండి:
24 మార్చి, 2026 01:50 PMకి

సంబంధిత వార్తలు

భారత్–దక్షిణ కొరియా వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్–దక్షిణ కొరియా వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్–దక్షిణ కొరియా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత పర్యటనకు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ కు.. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, PM మోదీ ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో సహకారం పెంపుపై దృష్టి సారించే అవకాశముంది.

8 నిమిషాల క్రితం
తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి రేటు

తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి రేటు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

9 నిమిషాల క్రితం
వణికిపోయిన ప్యాసింజర్స్.. ఫ్లై91లో ఏం జరిగింది?

వణికిపోయిన ప్యాసింజర్స్.. ఫ్లై91లో ఏం జరిగింది?

హైదరాబాద్ నుంచి హుబ్బళ్లి వెళ్లాల్సిన ఫ్లై91 విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్య, వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరుకు దారి మళ్లించారు. దాదాపు 3 గంటల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. చివరకు అందరూ సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.

11 నిమిషాల క్రితం
నియమాలు పాటిద్దాం - ప్రమాదాలను నివారిద్దాం.

నియమాలు పాటిద్దాం - ప్రమాదాలను నివారిద్దాం.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ISI మార్కు ఉన్న హెల్మెట్ ధరించాలి. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం లేదా మెసేజ్ చేయడం వంటివి ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. రోడ్డు దాటేటప్పుడు ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్ మాత్రమే ఉపయోగించండి.

11 నిమిషాల క్రితం