LIVE
D4baccea 2eb5 4990 88db 7ab881a11785 1
వెనక్కి
SportsCrime

CSK ‌ఫిర్యాదు సంచలనం.. ‘బ్లాక్ మ్యాజిక్’పై BCCIకి లేఖ

3 గంటల క్రితం
Telangana, Andhra Pradesh
సారాంశం

ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన SRH vs CSK మ్యాచ్‌పై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. CSK యాజమాన్యం బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేస్తూ, మ్యాచ్ సమయంలో ప్రేక్షకులలో కొంతమంది అసాధారణ, అప్రకృత కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొంది. చేతి సంకేతాలు, విచిత్ర చిహ్నాలు గీయడం, నల్ల బట్టలు ఉపయోగించడం వంటి చర్యలు ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని జరిగాయని తెలిపింది. ఈ సంఘటన మ్యాచ్ లో ప్రభావం చూపిందని పేర్కొంది.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 02:47 PMకి

సంబంధిత వార్తలు

జాల్మూరి టేస్ట్ అదిరిందన్న ప్రధాని..

జాల్మూరి టేస్ట్ అదిరిందన్న ప్రధాని..

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న ప్రధాని మోదీ మధ్యలో కాస్త విరామం తీసుకుని జార్గ్రామ్‌లో జాల్మురి రుచి చూశారు. వరుసగా4 ర్యాలీల మధ్య స్థానిక ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా గడిపినట్లు తన ఎక్స్ హ్యాండిల్‌లో వెల్లడించారు. జాల్మురి అనేది బెంగాలీలు ఇష్టంగా తినే స్నాక్. ముర్మురేలు, మసాలాలు, ఉల్లిపాయ, మిర్చితో తయారై కారంగా ఉండే ఈ స్నాక్ తనకు చాలా ఇష్టమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

6 నిమిషాల క్రితం
కేకేఆర్ స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ విలవిల..

కేకేఆర్ స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ విలవిల..

ఈడెన్ గార్డెన్స్‌లో KKR బౌలర్లు RRను కట్టడి చేశారు. వరుణ్ చక్రవర్తి (3 వికెట్లు), సునీల్ నరైన్ మాయాజాలంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు వైభవ్ (46), జైస్వాల్ (39) మెరుపు ఆరంభాన్నిచ్చినా, మధ్య ఓవర్లలో కేకేఆర్ స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో కేకేఆర్ ముందు 156 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.

22 నిమిషాల క్రితం
మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..

మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎల్బీ నగర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, బాచుపల్లి , మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడటంతో , ఎండ లతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల అకస్మాత్తుగ ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

22 నిమిషాల క్రితం
BREAKING: టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి

BREAKING: టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కట్టనార్‌పట్టి సమీపంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రసాయనాలు కలుపుతున్న సమయంలో ఘర్షణ జరగడం వల్లే ఈ పేలుడు సంభవించిందని నిర్ధారించారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

32 నిమిషాల క్రితం