LIVE
RAGHU RAMA
వెనక్కి
Crime

సీఐడీ కస్డడీలో రఘురామను అడిగిన ప్రశ్నలేంటి..? విచారణలో తడబడిన సునీల్ నాయక్..

40 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను పోలీసులు 6వ రోజు కీలక అంశాలపై ప్రశ్నించారు. ముఖ్యంగా రఘురామను కస్టడీలోకి తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలపై విచారణ సాగింది. కస్టడీలో రఘురామను ఎక్కడ ఉంచారు? ఎవరెవరు విచారించారు? ఏఏ అంశాలపై ప్రశ్నించారు? అనే విషయాలపై సునీల్ నాయక్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇతర పోలీసు అధికారుల పాత్రపై కూడా వివరాలు సేకరించారు. దీంతో సరైన సమాధానాలు చెప్పలేక సునీల్ నాయక్ తడబడినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు దర్యాప్తు బృందం వద్ద ఉన్న ఆధారాలు, రికార్డులతో సునీల్ నాయక్ ఇచ్చిన సమాధానాలను పోల్చి పరిశీలించారు. సునీల్ నాయక్ నుంచి రాబట్టిన సమాచారం అధారంగా త్వరలో మరికొందరు ముద్దాయిల్ని విచారించే అవకాశం ఉంది.

షేర్ చేయండి:
11 మార్చి, 2026 09:13 AMకి

సంబంధిత వార్తలు

RED SALUTE: ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలకు 45 ఏండ్లు!

RED SALUTE: ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలకు 45 ఏండ్లు!

ADB జిల్లా ఇంద్రవెల్లి పోలీసు కాల్పులకు నేటితో 45 ఏళ్లు నిండాయి. భూమి, అటవీ హక్కుల సాధన కోసం 1981 ఏప్రిల్ 20న గిరిజనులు సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవ కాల్పులకు దారితీయగా 300 మందికి పైగా అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోగా, అధికారులు 13 మంది చనిపోయారని చెప్పారు. హక్కుల కోసం అసువులుబాసిన ఆ వీరులకు ఏటా ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తారు.

13 నిమిషాల క్రితం
ఎన్‌జీవో ముసుగులో దారుణాలు.. మహిళలపై వేధింపులు

ఎన్‌జీవో ముసుగులో దారుణాలు.. మహిళలపై వేధింపులు

నాగ్‌పూర్‌లో ఎన్‌జీవో ముసుగులో మత మార్పిడిలకు పాల్పడుతున్న రియాజ్ కాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సంస్థలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించాలని, మతం మారాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏటీఎస్ లోతుగా విచారణ చేస్తోంది.

16 నిమిషాల క్రితం
KALESWARAM CASE : 22న హైకోర్టు తీర్పు… ADVCతో హరీష్ భేటీ

KALESWARAM CASE : 22న హైకోర్టు తీర్పు… ADVCతో హరీష్ భేటీ

మాజీ మంత్రి హరీష్ రావు.. న్యాయ నిపుణులను, న్యాయవాదులతో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కేసీఆర్, హరీష్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఏప్రిల్ 22న తన తీర్పును వెలువరించనుంది. కేసీఆర్, హరీష్‌లు కాళేశ్వరంపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికను కోర్టులో సవాలు చేశారు.

26 నిమిషాల క్రితం
కన్నపిల్లలనే కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!

కన్నపిల్లలనే కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఒక తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. తన ముగ్గురు కుమారులను వరుసగా నిలబెట్టి రైఫిల్‌తో కాల్చి చంపి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. పారిపోవడానికి ప్రయత్నించిన ఒక కుమారుడిని వెంటాడి పట్టుకుని మరీ కాల్పులు జరపడం అతడి క్రూరత్వానికి పరాకాష్ట. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి తన బిడ్డలను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు.

28 నిమిషాల క్రితం