LIVE
Supreme Court 4f96217651 V Jpg  450x253 4g
వెనక్కి
General

క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు

26 రోజుల క్రితం
సారాంశం

క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హిందువులు, బౌద్దులు, సిక్కులు మాత్రమే ఆ హక్కులు పొందుతారని స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని, కాబట్టి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని కోర్టు పేర్కొంది. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్‌గా పనిచేస్తున్న ఆనంద్ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్వహించడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో, వారిపై ఆనంద్ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. ఈ కేసులోనే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మసనం సంచలన తీర్పు ఇచ్చింది.

షేర్ చేయండి:
24 మార్చి, 2026 01:28 PMకి

సంబంధిత వార్తలు

తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి రేటు

తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి రేటు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

2 నిమిషాల క్రితం
వణికిపోయిన ప్యాసింజర్స్.. ఫ్లై91లో ఏం జరిగింది?

వణికిపోయిన ప్యాసింజర్స్.. ఫ్లై91లో ఏం జరిగింది?

హైదరాబాద్ నుంచి హుబ్బళ్లి వెళ్లాల్సిన ఫ్లై91 విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్య, వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరుకు దారి మళ్లించారు. దాదాపు 3 గంటల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. చివరకు అందరూ సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.

3 నిమిషాల క్రితం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద కొత్త బిల్డింగ్ రూల్స్ ఇవే..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద కొత్త బిల్డింగ్ రూల్స్ ఇవే..

ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి కీలకమైన సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభు త్వం GO నంబర్ 124 జారీ చేసింది. దీని ప్రకారం.. గృహాలు, అపార్ట్‌మెంట్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు నిర్మాణ దశలోనే సౌండ్ ప్రూఫ్ పద్ధతులను పాటించాలి. విమానాలు తక్కువ ఎత్తులో ఎగురు తున్నప్పుడు కలిగే ఇంజిన్ల మోత వినిపించకుండా నిర్మాణంలో సౌండ్ ఫ్రూఫ్ మెటీరియల్‌ను తప్పనిసరి చేసింది.

8 నిమిషాల క్రితం
అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు అల్పాహారం..

అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు అల్పాహారం..

తన 76వ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌కు వచ్చారు. భార్య భువనేశ్వరితో కలిసి కొంత మంది పేదలకు బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. అనంతరం అక్కడే అల్ఫాహారం స్వీకరించారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ కు రూ.76 లక్షలను భువనేవ్వరి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. పేదల ఆకలి తీర్చే అవకాశం వచ్చినందుకు చంద్రబాబు దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

26 నిమిషాల క్రితం