LIVE
Screenshot (417)
వెనక్కి
General

జొమాటో బాటలోనే స్విగ్గీ

26 రోజుల క్రితం
Andhra Pradesh, Telangana
సారాంశం

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తన వినియోగదారులకు చేదు వార్త చెప్పింది. ఒక్కో ఆర్డర్‌పై వసూలు చేసే ప్లాట్‌ఫామ్ ఫీజును భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక్కో ఆర్డర్‌పై ఉన్న రూ. 14.99 ఫీజును జీఎస్టీతో కలిపి రూ. 17.58 కు పెంచింది.ఇటీవలే జొమాటో కూడా తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచిన కొద్ది రోజుల్లోనే స్విగ్గీ కూడా అదే బాట పట్టడం గమనార్హం. 2025 ఆగస్టులో ఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 12 నుండి రూ. 14కు పెంచిన సంస్థ, ఇప్పుడు మరో 17 శాతం వరకు పెంచడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

షేర్ చేయండి:
24 మార్చి, 2026 02:19 PMకి

సంబంధిత వార్తలు

తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి రేటు

తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి రేటు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

2 నిమిషాల క్రితం
వణికిపోయిన ప్యాసింజర్స్.. ఫ్లై91లో ఏం జరిగింది?

వణికిపోయిన ప్యాసింజర్స్.. ఫ్లై91లో ఏం జరిగింది?

హైదరాబాద్ నుంచి హుబ్బళ్లి వెళ్లాల్సిన ఫ్లై91 విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్య, వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరుకు దారి మళ్లించారు. దాదాపు 3 గంటల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. చివరకు అందరూ సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.

3 నిమిషాల క్రితం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద కొత్త బిల్డింగ్ రూల్స్ ఇవే..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద కొత్త బిల్డింగ్ రూల్స్ ఇవే..

ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి కీలకమైన సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభు త్వం GO నంబర్ 124 జారీ చేసింది. దీని ప్రకారం.. గృహాలు, అపార్ట్‌మెంట్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు నిర్మాణ దశలోనే సౌండ్ ప్రూఫ్ పద్ధతులను పాటించాలి. విమానాలు తక్కువ ఎత్తులో ఎగురు తున్నప్పుడు కలిగే ఇంజిన్ల మోత వినిపించకుండా నిర్మాణంలో సౌండ్ ఫ్రూఫ్ మెటీరియల్‌ను తప్పనిసరి చేసింది.

8 నిమిషాల క్రితం
అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు అల్పాహారం..

అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు అల్పాహారం..

తన 76వ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌కు వచ్చారు. భార్య భువనేశ్వరితో కలిసి కొంత మంది పేదలకు బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. అనంతరం అక్కడే అల్ఫాహారం స్వీకరించారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ కు రూ.76 లక్షలను భువనేవ్వరి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. పేదల ఆకలి తీర్చే అవకాశం వచ్చినందుకు చంద్రబాబు దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

26 నిమిషాల క్రితం