LIVE
Screenshot 2026 03 24 134405
వెనక్కి
General

రైల్వే టికెట్ రద్దుపై కొత్త రూల్స్.. ఎప్పుడు ఎంత రిఫండ్?

26 రోజుల క్రితం
Telangana
సారాంశం

భారతీయ రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ట్రైన్ బయల్దేరే సమయాన్ని ఆధారంగా తీసుకుని రిఫండ్ విధానం సవరించింది. ప్రయాణానికి 72 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే గరిష్ట రిఫండ్ లభిస్తుంది. 72 నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే సుమారు 25% ఛార్జీ కట్ చేసి మిగతా మొత్తాన్ని ఇస్తారు. 24 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50% వరకు కట్ చేస్తారు. 8 గంటల లోపు లేదా ట్రైన్ బయల్దేరిన తర్వాత రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ ఉండదు. మొత్తంగా… ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

షేర్ చేయండి:
24 మార్చి, 2026 01:42 PMకి

సంబంధిత వార్తలు

భారత్–దక్షిణ కొరియా వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్–దక్షిణ కొరియా వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్–దక్షిణ కొరియా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత పర్యటనకు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ కు.. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, PM మోదీ ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో సహకారం పెంపుపై దృష్టి సారించే అవకాశముంది.

9 నిమిషాల క్రితం
తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి రేటు

తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి రేటు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

11 నిమిషాల క్రితం
వణికిపోయిన ప్యాసింజర్స్.. ఫ్లై91లో ఏం జరిగింది?

వణికిపోయిన ప్యాసింజర్స్.. ఫ్లై91లో ఏం జరిగింది?

హైదరాబాద్ నుంచి హుబ్బళ్లి వెళ్లాల్సిన ఫ్లై91 విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్య, వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరుకు దారి మళ్లించారు. దాదాపు 3 గంటల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. చివరకు అందరూ సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.

12 నిమిషాల క్రితం
నియమాలు పాటిద్దాం - ప్రమాదాలను నివారిద్దాం.

నియమాలు పాటిద్దాం - ప్రమాదాలను నివారిద్దాం.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ISI మార్కు ఉన్న హెల్మెట్ ధరించాలి. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం లేదా మెసేజ్ చేయడం వంటివి ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. రోడ్డు దాటేటప్పుడు ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్ మాత్రమే ఉపయోగించండి.

13 నిమిషాల క్రితం