ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని, లేనిపక్షంలో ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని సభ్య దేశాలు హెచ్చరించాయి. అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తుండగా, రష్యా మరియు చైనా ఇరాన్‌పై దాడులను తీవ్రంగా ఖండించాయి. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని అరబ్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయ శాంతికి భంగం కలిగిస్తున్నాయని ఐరాస సెక్రటరీ జనరల్ ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు
మలి విడత చర్చలకు రెడీ అవుతున్న ఇరాన్, అమెరికా
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పాకిస్థాన్ లో మలి విడత చర్చలకు రంగం సిద్ధం అవుతోంది. ట్రంప్ రెచ్చ గొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చల ప్రక్రియపై అందరి దృష్టీ కేంద్రీకృతం అయి ఉంది. అమెరికా ప్రతినిధులు సోమవారం పాక్ చేరుకుంటారని భావిస్తున్నారు. ఇరాన్ ప్రతినిధుల రాకపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే.. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అంగీకరించక పోతే భారీ వినాశనం తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు.
.jpg)
ఇరాన్‌కు అమెరికా చుక్కలు: ప్రపంచవ్యాప్తంగా నౌకల సీజ్..
హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు అమెరికా ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకలు ,చమురు ట్యాంకర్లు కనిపిస్తే వాటిని సీజ్ చేయాలని పెంటగాన్ యోచిస్తోంది. ఇరాన్ పోర్టులను ఇప్పటికే దిగ్బంధించిన అమెరికా, హర్మూజ్ వద్ద 23 నౌకలను అడ్డుకుని తనిఖీలు చేపట్టింది.ఈ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదంఉంది.

ఇంతకీ హార్మూజ్ ఓపెన్ కాలేదా..??
హార్మూజ్ జల సంధి ఓపెన్ అయ్యింది అని అమెరికా చెబుతున్నప్పటికీ, ప్రపంచ దేశాలు పూర్తిగా నమ్మడం లేదు. అక్కడినుంచి ప్రయాణిస్తున్న కమర్షియల్ నౌకలు చాలా జాగ్రత్తగా కదులుతున్నట్లు తెలుస్తోంది. సముద్ర గర్భంలో సీ మైన్స్. ప్రమాదం దృష్ట్యా ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటున్నారు. అందుచేత పూర్తిగా ట్రాఫిక్ ఊపందుకునేందుకు సమయం పట్టేటట్లుంది.

ఎప్పుడూ సంక్షోభంలోనే లెబనాన్.. కారణాలివే!
లెబనాన్ తరచూ సంక్షోభాల్లో చిక్కుకోవడానికి అనేక కారణాలున్నాయి. క్లిష్టమైన భౌగోళిక, రాజకీయ పరిస్థితులు దేశాన్ని అస్థిరతలోకి నెట్టేస్తున్నాయని బీరుట్ బ్యూరో చీఫ్ మాయా గెబీలీ తెలిపారు. మంచి పొరుగు దేశాలు లేవని అత్యధిక లెబనీస్ ప్రజలు భావన. వీటికి తోడు దేశంలో తీవ్ర అంతర్గత రాజకీయ విభేదాలు, భారీ ఆర్థిక సంక్షోభం, ప్రాంతీయ ఉద్రిక్తతలు అన్నీ కలగలిపి లెబనాన్ పరిస్థితిని క్లిష్టంగా మార్చేస్తున్నాయి.
