హర్మూజ్ జలసంధిపై అమెరికా సెంట్రల్ కమాండ్ చేసిన ప్రకటనలతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇరాన్ పోర్టులకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకుంటామని అమెరికా హెచ్చరించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో వాణిజ్య నౌకలు అమెరికా దళాలతో టచ్‌లో ఉండాలని సూచించింది. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తూ, తమ సముద్ర మార్గంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
సంబంధిత వార్తలు
.png)
లీడర్ పోయి 50 రోజులు.. అంత్యక్రియలపై మిస్టరీ
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయి 7 వారాలు గడుస్తున్నా, ఇంకా అంత్యక్రియలు నిర్వహించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భద్రతా కారణాలు మరియు ఇజ్రాయెల్ దాడుల భయంతోనే ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది. కనీసం అంత్యక్రియల స్థలాన్ని కూడా ఇంకా ఖరారు చేయకపోవడం గమనార్హం.
-2.jpg)
కన్నపిల్లలనే కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఒక తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. తన ముగ్గురు కుమారులను వరుసగా నిలబెట్టి రైఫిల్‌తో కాల్చి చంపి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. పారిపోవడానికి ప్రయత్నించిన ఒక కుమారుడిని వెంటాడి పట్టుకుని మరీ కాల్పులు జరపడం అతడి క్రూరత్వానికి పరాకాష్ట. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి తన బిడ్డలను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు.

భారత్–దక్షిణ కొరియా వ్యూహాత్మక భాగస్వామ్యం
భారత్–దక్షిణ కొరియా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత పర్యటనకు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ కు.. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, PM మోదీ ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో సహకారం పెంపుపై దృష్టి సారించే అవకాశముంది.

ఇరాన్‌తో వెపన్స్ డీల్.. అమెరికాలో మహిళ అరెస్ట్
ఇరాన్ పై అప్రకటిత యుద్దం కొనసాగిస్తున్న నేపథ్యంలో అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన షమీమ్ మాఫీ అనే ఓ మహిళా వ్యాపార వేత్తను లాస్ ఏంజలిస్ లో యూఎస్ అధికారులు అరెస్టు చేశారు. ఇరాన్‌కు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసేందుకు ఈ మహిళా వ్యాపారవేత్త మధ్యవర్తిత్వం చేస్తున్నారని అమెరికా ఆరోపించింది. ఇరాన్ మూలాలు ఉన్న షపీ చాలా కాలంగా అమెరికాలో స్థిరపడినట్టు తెలుస్తోంది.