LIVE
Screenshot (20) 1
వెనక్కి
Crime

వాట్సాప్ వివాదం..యువకుడికి నరకం చూపించిన కిరాతకులు

3 రోజుల క్రితం
Andhra Pradesh, Telangana
సారాంశం

రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఒక ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ చాట్‌కు సంబంధించిన వ్యక్తిగత వివాదం కారణంగా దేవి సింగ్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు అత్యంత కిరాతకంగా దాడి చేశారు. అతని ముఖానికి నల్ల రంగు పూసి, బలవంతంగా మూత్రం తాగించడమే కాకుండా, కుక్క విసర్జితాలను తినిపించి చిత్రహింసలకు గురిచేశారు.

షేర్ చేయండి:
16 ఏప్రిల్, 2026 12:52 PMకి

సంబంధిత వార్తలు

RED SALUTE: ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలకు 45 ఏండ్లు!

RED SALUTE: ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలకు 45 ఏండ్లు!

ADB జిల్లా ఇంద్రవెల్లి పోలీసు కాల్పులకు నేటితో 45 ఏళ్లు నిండాయి. భూమి, అటవీ హక్కుల సాధన కోసం 1981 ఏప్రిల్ 20న గిరిజనులు సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవ కాల్పులకు దారితీయగా 300 మందికి పైగా అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోగా, అధికారులు 13 మంది చనిపోయారని చెప్పారు. హక్కుల కోసం అసువులుబాసిన ఆ వీరులకు ఏటా ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తారు.

19 నిమిషాల క్రితం
ఎన్‌జీవో ముసుగులో దారుణాలు.. మహిళలపై వేధింపులు

ఎన్‌జీవో ముసుగులో దారుణాలు.. మహిళలపై వేధింపులు

నాగ్‌పూర్‌లో ఎన్‌జీవో ముసుగులో మత మార్పిడిలకు పాల్పడుతున్న రియాజ్ కాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సంస్థలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించాలని, మతం మారాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏటీఎస్ లోతుగా విచారణ చేస్తోంది.

21 నిమిషాల క్రితం
KALESWARAM CASE : 22న హైకోర్టు తీర్పు… ADVCతో హరీష్ భేటీ

KALESWARAM CASE : 22న హైకోర్టు తీర్పు… ADVCతో హరీష్ భేటీ

మాజీ మంత్రి హరీష్ రావు.. న్యాయ నిపుణులను, న్యాయవాదులతో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కేసీఆర్, హరీష్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఏప్రిల్ 22న తన తీర్పును వెలువరించనుంది. కేసీఆర్, హరీష్‌లు కాళేశ్వరంపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికను కోర్టులో సవాలు చేశారు.

32 నిమిషాల క్రితం
కన్నపిల్లలనే.. కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!

కన్నపిల్లలనే.. కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఒక తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. తన ముగ్గురు కుమారులను వరుసగా నిలబెట్టి రైఫిల్‌తో కాల్చి చంపి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. పారిపోవడానికి ప్రయత్నించిన ఒక కుమారుడిని వెంటాడి పట్టుకుని మరీ కాల్పులు జరపడం అతడి క్రూరత్వానికి పరాకాష్ట. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి తన బిడ్డలను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు.

34 నిమిషాల క్రితం