వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత ఐటీ సంస్థలపై కూడా ప్రభావం చూపుతోంది. క్యాంటీన్ కార్యకలాపాలు అంతరాయం కలగడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలని సూచిస్తున్నాయి. ఇంధనాన్ని ఆదా చేసేందుకు వీలైనంత మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు సూచిస్తున్నాయి. చెన్నైలో హెచ్‌సీఎల్ టెక్ ఈనెల 12, 13 తేదీల్లో ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించింది. గ్యాస్ కొరతతో క్యాంటీన్ వెండర్లు సేవలు నిలిపివేయడం దీనికి కారణమని కంపెనీ తెలిపింది. ఇన్ఫోసిస్ కూడా బెంగళూరు, చెన్నై కార్యాలయాల్లో క్యాంటీన్‌లలో పరిమిత ఆహారం మాత్రమే అందుబాటులో ఉంటుందని ఉద్యోగులకు సూచించింది.
సంబంధిత వార్తలు

MOVIE UPDATE : షూటింగ్ పూర్తి.. జాన్వీ జంప్
రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పెద్ది షూటింగ్ పూర్తయింది. దీంతో హీరోయిన్ జాన్వీకపూర్ సమ్మర్ వెకేషన్ కోసం స్విట్జర్లాండ్ చెక్కేసింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ సినిమాలో అచ్చియమ్మ అనే పవర్‌ఫుల్ పాత్రలో జాన్వీ నటిస్తోంది. జూన్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఆమె ఏకంగా రూ.6 కోట్లు తీసుకున్నట్లు టాక్.
.png)
పూరీ జగన్నాథ్ కు సేతుపతి స్పెషల్ విష్.. ఏమన్నారంటే?
టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.పూరీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన తెరకెక్కిస్తున్న 'స్లమ్ డాగ్' చిత్రం కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

"హ్యాపీ బర్త్‌డే మావయ్య " చంద్రబాబుకు ఎన్టీఆర్ విషెస్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ నటుడు ఎన్టీఆర్ 'ఎక్స్' వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. "చంద్రబాబు నాయుడు మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తారక్ బంధాన్ని గుర్తుచేస్తూ 'మావయ్య' అని సంబోధించడం నందమూరి, నారా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

రూ. 35 కోట్లతో విడాకుల సెటిల్‌మెంట్..?
తమిళ హీరో విజయ్-సంగీత విడాకులపై చెన్నైలో ఆసక్తికర టాక్స్ నడుస్తున్నాయి . పరస్పర అంగీకారంతో విడిపోవాలని ఇరు వర్గాలు లాయర్లతో శనివారం చర్చించినట్లు సమాచారం. విడాకుల పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. సెటిల్‌మెంట్‌గా రూ.250 కోట్లు కోరిన సంగీతకు, రూ.35 కోట్ల ఇవ్వటానికి విజయ్ అంగీకరించినట్లు తెలిసింది. పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని విజయ్ తెలిపినట్లు సమాచారం.
