తెలంగాణలో పార్టీ మారిన ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. గతంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దానం నాగేందర్, అరికపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకటరావు వంటి ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని అనర్హతగా పరిగణించాలని పిటిషనర్లు కోరారు. ఈ విషయంలో తమ వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా హైకోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
సంబంధిత వార్తలు
.png)
ప్రజల మధ్యే బాబు పుట్టినరోజు
పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన, ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. నారా భువనేశ్వరి గారు రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచితంగా ఆహారం అందించేందుకు రూ. 76 లక్షల విరాళాన్ని అందజేశారు.
.png)
సొంత నియోజకవర్గంలో జగన్ పర్యటన
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 21 నుండి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ఆయన 'ప్రజాదర్బార్' నిర్వహిస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్లలో ఇటీవల మరణించిన పార్టీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.
.png)
జగిత్యాలలో గులాబీ జాతర: నేడు కేసీఆర్ భారీ బహిరంగ సభ
తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్న భారీ బహిరంగ సభకు జగిత్యాల సిద్ధమైంది. నేడు సాయంత్రం జరగనున్న ఈ 'ప్రజా ఆశీర్వాద సభ'లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. గత ఏడాది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్, ఈ సభ ద్వారా తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. ఈ వేదికపైనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
.png)
ఏపీ సీఎం ఎంట్రీ.. తమిళనాట మారుతున్న సమీకరణాలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్డీయే అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ప్రధానంగా తెలుగు ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బహిరంగ సభల్లో పాల్గొంటూ, ఎన్డీయే అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధిని వివరిస్తారు.
.png)