
LOVE FAILURE: ప్రేయసికి పెళ్లి.. భరించలేక యువకుడు సూసైడ్
AP: లవ్ ఫెయిల్ అవడంతో మనస్తాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. ప్రాణంగా ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి జరగడాన్ని జీర్ణించుకోలేకపోయిన చిత్తూరు(D) గంగవరం(M) వేములపల్లికి చెందిన మహేంద్ర (20) గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయాడు. అంతకుముందు ముందు తన తల్లిని బాగా చూసుకోవాలని బాబాయ్, సోదరికి మెసేజ్ లు చేశాడు. స్థానిక వెంకటరమణ లే అవుట్లో ఘటన జరిగింది.
సంబంధిత వార్తలు

DANGER : చావుతో ఆట.. రైల్వే స్టేషన్‌లో హైడ్రామా
మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఒక యువకుడు 25 వేల వోల్టుల హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్‌చల్ చేశాడు. ఇది గమనించిన అధికారులు వెంటనే కరెంట్ సరఫరా నిలిపివేసి.. గంటన్నర పాటు శ్రమించి అతడిని సురక్షితంగా కిందికి దించారు. ఈ హైడ్రామా వల్ల మూడు రైళ్ల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆ యువకుడు మానసిక స్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ఎప్పుడూ సంక్షోభంలోనే లెబనాన్.. కారణాలివే!
లెబనాన్ తరచూ సంక్షోభాల్లో చిక్కుకోవడానికి అనేక కారణాలున్నాయి. క్లిష్టమైన భౌగోళిక, రాజకీయ పరిస్థితులు దేశాన్ని అస్థిరతలోకి నెట్టేస్తున్నాయని బీరుట్ బ్యూరో చీఫ్ మాయా గెబీలీ తెలిపారు. మంచి పొరుగు దేశాలు లేవని అత్యధిక లెబనీస్ ప్రజలు భావన. వీటికి తోడు దేశంలో తీవ్ర అంతర్గత రాజకీయ విభేదాలు, భారీ ఆర్థిక సంక్షోభం, ప్రాంతీయ ఉద్రిక్తతలు అన్నీ కలగలిపి లెబనాన్ పరిస్థితిని క్లిష్టంగా మార్చేస్తున్నాయి.

గంజాయి స్మగ్లింగ్.. రూ.38 లక్షల సరుకు సీజ్
అనకాపల్లి జిల్లా చోడవరం పోలీసులు మత్తు దందాలపై ఉక్కుపాదం మోపారు. భారీగా లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకుని, తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చోడవరం దగ్గర తనిఖీల క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన తగరంపూడికి చెందిన సంపర్తి కొండలరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.38,50,000 విలువ చేసే 3 కేజీల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

CSK ఫిర్యాదు సంచలనం.. ‘బ్లాక్ మ్యాజిక్’పై BCCIకి లేఖ
ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన SRH vs CSK మ్యాచ్‌పై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. CSK యాజమాన్యం బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేస్తూ, మ్యాచ్ సమయంలో ప్రేక్షకులలో కొంతమంది అసాధారణ, అప్రకృత కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొంది. చేతి సంకేతాలు, విచిత్ర చిహ్నాలు గీయడం, నల్ల బట్టలు ఉపయోగించడం వంటి చర్యలు ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని జరిగాయని తెలిపింది. ఈ సంఘటన మ్యాచ్ లో ప్రభావం చూపిందని పేర్కొంది.