
షాకింగ్.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు చేతబడి
శనివారం SRH, CSK మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో, ఫోటోలు వైరల్ గా మారింది. CSK ఆటగాడు దుబే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో SRH అభిమాని నిమ్మకాయ పట్టుకుని మంత్రాలు చదువుతూ బ్లాక్ మ్యాజిక్ లైవ్ అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన క్రికెట్ అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. దీనిపై CSK కంప్లైంట్ చేయాలంటూ కొందరు.. మంత్రాలకు చింతకాయలు కూడా రాలబోవని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
సంబంధిత వార్తలు

'నాగబంధం' నుంచి ఎనర్జిటిక్ 'సుర సుర' సాంగ్!
విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం 'నాగబంధం' నుండి సెకండ్ సింగిల్ 'సుర సుర' సాంగ్ లిరికల్ వీడియో నేడు విడుదలైంది. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ పాటలో విరాట్ కర్ణ తన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకోగా, నభా నటేష్ తన గ్లామర్‌తో అలరించింది.ఇప్పుడు 'సుర సుర' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

'వాలీ' మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన క్రిష్!
ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేతుల మీదుగా విడుదలైన ‘వాలీ’ చిత్ర మోషన్ పోస్టర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ తెరపై వాలీబాల్ క్రీడ నేపథ్యంలో వస్తున్న మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామాగా గుర్తింపు పొందిన ఈ చిత్రం, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. క్రిష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

కేకేఆర్ స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ విలవిల..
ఈడెన్ గార్డెన్స్‌లో KKR బౌలర్లు RRను కట్టడి చేశారు. వరుణ్ చక్రవర్తి (3 వికెట్లు), సునీల్ నరైన్ మాయాజాలంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు వైభవ్ (46), జైస్వాల్ (39) మెరుపు ఆరంభాన్నిచ్చినా, మధ్య ఓవర్లలో కేకేఆర్ స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో కేకేఆర్ ముందు 156 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద 'వాళా 2' విధ్వంసం!
మలయాళ చిత్ర పరిశ్రమలో 'వాళా 2'బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో, సరికొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన 17 రోజుల్లోనే ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అతి తక్కువ కాలంలో ఈ మైలురాయిని చేరుకున్న మలయాళ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది.