
ఎలా ఉన్నారు .. పవన్‌కు జగన్ పరామర్శ
AP: రాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. Dy CM పవన్ కల్యాణ్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురికాగా. శనివారం వైద్యులు ఓ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. "పవన్ కల్యాణ్ సర్జరీ తర్వాత త్వరగా, పూర్తిస్థాయిలో కోలుకోవాలని కోరుకుంటున్నాను. గెట్ వెల్ సూన్" అని జగన్ ట్వీట్ చేశారు.
సంబంధిత వార్తలు

'వాలీ' మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన క్రిష్!
ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేతుల మీదుగా విడుదలైన ‘వాలీ’ చిత్ర మోషన్ పోస్టర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ తెరపై వాలీబాల్ క్రీడ నేపథ్యంలో వస్తున్న మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామాగా గుర్తింపు పొందిన ఈ చిత్రం, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. క్రిష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
బాక్సాఫీస్ వద్ద 'వాళా 2' విధ్వంసం!
మలయాళ చిత్ర పరిశ్రమలో 'వాళా 2'బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో, సరికొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన 17 రోజుల్లోనే ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అతి తక్కువ కాలంలో ఈ మైలురాయిని చేరుకున్న మలయాళ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది.

ఇంతకీ పవన్ కళ్యాణ్ కి జరిగిన ఆపరేషన్ ఏమిటి.. అంతా ఓకే నా .. ??
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సైనసైటిస్ ఆపరేషన్ జరిగింది. అంటే సైనస్ నాళం లోకి ఎండోస్కోపీ ద్వారా పైప్ పంపించి ఇన్ఫెక్షన్ క్లియర్ చేశారు. సింపుల్ ప్రొసీజర్ కాబట్టి ఆ రోజే డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సెక్స్ కేసులో ఇరుక్కున్న బిజెపి నేత పుత్రరత్నం
ఉత్తర ప్రదేశ్ బిజెపి మాజీ మంత్రి నియర్ కుమార్ కుమారుడు రఘువంశీ అరెస్టు అయ్యారు. ముజఫర్ నగర్ లో ఒక మహిళను లైంగికంగా వేదించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. నీతులు చెప్పే బిజెపి నేతల వాస్తవ రూపం ఇదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.