MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూలగొట్టే విధానం తప్ప ప్రజలకు చేసింది శూన్యమన్నారు. BRS హయంలో ఎన్నో పథకాలు అమలు చేసిందని వీటికి రెట్టింపు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ జగిత్యాల సభతో బయటికి వస్తున్నారనగానే భయంతో రైతుబంధు వేస్తానని ప్రకటించిందని విమర్శించారు.
సంబంధిత వార్తలు

సీఎంతో చర్చలు..వంగవీటికి ఎమ్మెల్సీ ఛాన్స్?
వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ హామీ లభించిందా..? ఆయనను గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపించబోతున్నారా? సీఎం చంద్రబాబుతో 40 నిమిషాలకుపైగానే చర్చలు జరిపారు రాధాకృష్ణ. సీఎంవో నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ముఖ్యమంత్రిని కలిసినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా మండలి సీటుపై ఆయనకు హామీ లభించిందన్న చర్చ సాగుతోంది. అయితే..దీనిపై పార్టీ పరంగా కానీ రాధా పరంగా కానీ..ఎలాంటి లీకులు ఇవ్వలేదు.

తెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్ధం
గత డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులకు సంబంధించి ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మే నెలలోనే ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

కొండగట్టుకు ఎందుకు రాలేదు: బీఆర్ఎస్ సభపై మంత్రి అడ్లూరి ఫైర్
బీఆర్ఎస్ సభపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. ‘పదేళ్లు అధికారంలో ఉండి అహంకారంతో ఊగిపోయిన మీరు, ఇప్పుడు నీతులు చెబుతారా?’ అని ప్రశ్నించారు. కొండగట్టు ప్రమాదంలో 60 మంది చనిపోతే రాని కేసీఆర్, ఇప్పుడు పదివేల మంది ఉండే సభకు హెలికాప్టర్‌లో రావడం ఏంటని ఎద్దేవా చేశారు. ఫాంహౌస్‌కే పరిమితమైన మీ నాయకుడు గుంటనక్కలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులకు అన్యాయం చేశాడని ఫైర్ అయ్యారు.

దేవుళ్ళపై ఒట్టేసి మోసం చేశారు: రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ధ్వజం
NLG జిల్లా గుర్రంపోడ్‌లో జరిగిన BRS సమావేశంలో హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే మాటే వినిపిస్తోంది. పది రోజులైనా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనే దిక్కు లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టడంలో బిజీగా ఉండి రైతుల బాధలు మర్చిపోయారు. దేవుళ్ల మీద ఒట్టేసి రుణమాఫీ పేరుతో రైతులను పచ్చి మోసం చేశారు అని విమర్శించారు.’’
