LIVE
IMG 4518
వెనక్కి
Politics

THNKS ALOT : మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్

1 గంటల క్రితం
Andhra Pradesh, Telangana
సారాంశం

AP: సర్జరీ తర్వాత కోలుకుంటున్న పవన్‌ కు PM మోదీ సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో 'X' వేదికగా.. పవన్ ఎంతో ధైర్యవంతుడు. ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆయన క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు. కాగా.. మోదీ చేసిన ట్వీట్‌కు పవన్ కల్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 02:03 PMకి

సంబంధిత వార్తలు

సీఎంతో చర్చలు..వంగవీటికి ఎమ్మెల్సీ ఛాన్స్?

సీఎంతో చర్చలు..వంగవీటికి ఎమ్మెల్సీ ఛాన్స్?

వంగ‌వీటి రాధాకు ఎమ్మెల్సీ హామీ లభించిందా..? ఆయ‌నను గ‌వ‌ర్నర్ కోటాలో శాస‌నమండ‌లికి పంపించ‌బోతున్నారా? సీఎం చంద్రబాబుతో 40 నిమిషాల‌కుపైగానే చ‌ర్చలు జ‌రిపారు రాధాకృష్ణ. సీఎంవో నుంచి వ‌చ్చిన పిలుపు మేర‌కు ఆయన ముఖ్యమంత్రిని కలిసినట్లుగా చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా మండ‌లి సీటుపై ఆయనకు హామీ ల‌భించింద‌న్న చ‌ర్చ సాగుతోంది. అయితే..దీనిపై పార్టీ ప‌రంగా కానీ రాధా ప‌రంగా కానీ..ఎలాంటి లీకులు ఇవ్వలేదు.

8 నిమిషాల క్రితం
తెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్ధం

తెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్ధం

గత డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులకు సంబంధించి ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మే నెలలోనే ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

13 నిమిషాల క్రితం
కొండగట్టుకు ఎందుకు రాలేదు: బీఆర్ఎస్ సభపై మంత్రి అడ్లూరి ఫైర్

కొండగట్టుకు ఎందుకు రాలేదు: బీఆర్ఎస్ సభపై మంత్రి అడ్లూరి ఫైర్

బీఆర్ఎస్ సభపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. ‘పదేళ్లు అధికారంలో ఉండి అహంకారంతో ఊగిపోయిన మీరు, ఇప్పుడు నీతులు చెబుతారా?’ అని ప్రశ్నించారు. కొండగట్టు ప్రమాదంలో 60 మంది చనిపోతే రాని కేసీఆర్, ఇప్పుడు పదివేల మంది ఉండే సభకు హెలికాప్టర్‌లో రావడం ఏంటని ఎద్దేవా చేశారు. ఫాంహౌస్‌కే పరిమితమైన మీ నాయకుడు గుంటనక్కలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులకు అన్యాయం చేశాడని ఫైర్ అయ్యారు.

29 నిమిషాల క్రితం
దేవుళ్ళపై ఒట్టేసి మోసం చేశారు: రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ధ్వజం

దేవుళ్ళపై ఒట్టేసి మోసం చేశారు: రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ధ్వజం

NLG జిల్లా గుర్రంపోడ్‌లో జరిగిన BRS సమావేశంలో హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే మాటే వినిపిస్తోంది. పది రోజులైనా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనే దిక్కు లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టడంలో బిజీగా ఉండి రైతుల బాధలు మర్చిపోయారు. దేవుళ్ల మీద ఒట్టేసి రుణమాఫీ పేరుతో రైతులను పచ్చి మోసం చేశారు అని విమర్శించారు.’’

35 నిమిషాల క్రితం