LIVE
Screenshot 2026 04 18 192910
వెనక్కి
General

ఉద్యోగానికి ఎసరు తెచ్చిన నైట్ ఫ్యాంట్..

1 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

బాపట్ల జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యంపై కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ కఠిన చర్యలు తీసుకున్నారు. స్థానిక 5వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, డిజిటల్ అసిస్టెంట్ నైట్ ప్యాంటుతో విధులకు హాజరుకావడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా గడువు తీరిన 11 అర్జీలు పెండింగ్‌లో ఉండడంపై అసహనం వ్యక్తం చేస్తూ బాధ్యతగా పని చేయాలని సూచించారు.

షేర్ చేయండి:
18 ఏప్రిల్, 2026 07:29 PMకి

సంబంధిత వార్తలు

అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు అల్పాహారం..

అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు అల్పాహారం..

తన 76వ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌కు వచ్చారు. భార్య భువనేశ్వరితో కలిసి కొంత మంది పేదలకు బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. అనంతరం అక్కడే అల్ఫాహారం స్వీకరించారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ కు రూ.76 లక్షలను భువనేవ్వరి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. పేదల ఆకలి తీర్చే అవకాశం వచ్చినందుకు చంద్రబాబు దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

11 నిమిషాల క్రితం
మళ్లీ భగ్గుమన్న ముడి చమురు ధరలు

మళ్లీ భగ్గుమన్న ముడి చమురు ధరలు

హార్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 85.89 డాలర్లకు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర 90.13 డాలర్లకు చేరుకుంది. 2027 వరకు అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్‌కు 3 డాలర్ల పైన ఉండే అవకాశం ఉందని అమెరికా ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నారు.

12 నిమిషాల క్రితం
మధుమేహం  ఉన్నవారు పుచ్చకాయను తినవచా

మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను తినవచా

మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను తినవచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పుచ్చకాయ యొక్క గ్లైసీమిక్ ఇండెక్స్ సుమారు 72. ఇది "ఎక్కువ"కేటగిరీలోకి వస్తుంది, ఇది చక్కెర స్థాయిలను పెంచగలదు. పుచ్చకాయను ఒకేసారి ఎక్కువగా తినకూడదు. ఒక చిన్న కప్పు ముక్కలను తీసుకోవడం సురక్షితం పుచ్చకాయను విడిగా తినడం కంటే, ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఉన్న బాదం, వాల్‌నట్స్ కలిపి తీసుకుంటే చక్కెర గ్రహించే వేగం తగ్గుతుంది.

13 నిమిషాల క్రితం
రూ. 35 కోట్లతో విడాకుల  సెటిల్‌మెంట్..?

రూ. 35 కోట్లతో విడాకుల సెటిల్‌మెంట్..?

తమిళ హీరో విజయ్‌-సంగీత విడాకులపై చెన్నైలో ఆసక్తికర టాక్స్ నడుస్తున్నాయి . పరస్పర అంగీకారంతో విడిపోవాలని ఇరు వర్గాలు లాయర్లతో శనివారం చర్చించినట్లు సమాచారం. విడాకుల పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. సెటిల్‌మెంట్‌గా రూ.250 కోట్లు కోరిన సంగీతకు, రూ.35 కోట్ల ఇవ్వటానికి విజయ్‌ అంగీకరించినట్లు తెలిసింది. పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని విజయ్‌ తెలిపినట్లు సమాచారం.

16 నిమిషాల క్రితం