
HEALTH TIPS : కదలకుండా కూర్చుంటే.. కాలేయానికి నష్టమే
20- 30 ఏళ్ల యువతలో కూడా ఫ్యాటీ లివర్ కనిపిస్తోంది. మారుతున్న లైఫ్ స్టైల్. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో కొవ్వు పేరుకుపోతోంది. జంక్ ఫుడ్, పిజ్జాలు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం ఒక కారణమైతే, వ్యాయామం లేని 'సెడెంటరీ లైఫ్' మరొక ముఖ్య కారణం. టైమ్‌కి తినకపోవడం, నిద్రలేమి కూడా జీవక్రియలను దెబ్బతీసి కాలేయంలో కొవ్వు పెరిగేలా చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు

'నాగబంధం' నుంచి ఎనర్జిటిక్ 'సుర సుర' సాంగ్!
విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం 'నాగబంధం' నుండి సెకండ్ సింగిల్ 'సుర సుర' సాంగ్ లిరికల్ వీడియో నేడు విడుదలైంది. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ పాటలో విరాట్ కర్ణ తన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకోగా, నభా నటేష్ తన గ్లామర్‌తో అలరించింది.ఇప్పుడు 'సుర సుర' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

'వాలీ' మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన క్రిష్!
ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేతుల మీదుగా విడుదలైన ‘వాలీ’ చిత్ర మోషన్ పోస్టర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ తెరపై వాలీబాల్ క్రీడ నేపథ్యంలో వస్తున్న మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామాగా గుర్తింపు పొందిన ఈ చిత్రం, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. క్రిష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎల్బీ నగర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, బాచుపల్లి , మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడటంతో , ఎండ లతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల అకస్మాత్తుగ ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బాక్సాఫీస్ వద్ద 'వాళా 2' విధ్వంసం!
మలయాళ చిత్ర పరిశ్రమలో 'వాళా 2'బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో, సరికొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన 17 రోజుల్లోనే ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అతి తక్కువ కాలంలో ఈ మైలురాయిని చేరుకున్న మలయాళ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది.