.jpg)
ధనుష్'కర'సినిమాలో ఆ రోల్ మిస్! ఎవరో తెలుసా!
ధనుష్ కథానాయకుడిగా విఘ్నేశ్ రాజా తెరకెక్కించిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కర'.లోని ఒక కీలక పాత్ర కోసం ముందుగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను సంప్రదించినట్లు దర్శకుడు తాజాగా వెల్లడించారు. స్క్రిప్టు విన్న పృథ్వీరాజ్, కథ బాగుందని మెచ్చుకున్నప్పటికీ.. రెండు విభిన్న కోణాల్లో సాగే ఆ క్యారెక్టర్ తనకు సెట్ కాదని భావించి సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు

'నాగబంధం' నుంచి ఎనర్జిటిక్ 'సుర సుర' సాంగ్!
విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం 'నాగబంధం' నుండి సెకండ్ సింగిల్ 'సుర సుర' సాంగ్ లిరికల్ వీడియో నేడు విడుదలైంది. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ పాటలో విరాట్ కర్ణ తన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకోగా, నభా నటేష్ తన గ్లామర్‌తో అలరించింది.ఇప్పుడు 'సుర సుర' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

'వాలీ' మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన క్రిష్!
ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేతుల మీదుగా విడుదలైన ‘వాలీ’ చిత్ర మోషన్ పోస్టర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ తెరపై వాలీబాల్ క్రీడ నేపథ్యంలో వస్తున్న మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామాగా గుర్తింపు పొందిన ఈ చిత్రం, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. క్రిష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
బాక్సాఫీస్ వద్ద 'వాళా 2' విధ్వంసం!
మలయాళ చిత్ర పరిశ్రమలో 'వాళా 2'బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో, సరికొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన 17 రోజుల్లోనే ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అతి తక్కువ కాలంలో ఈ మైలురాయిని చేరుకున్న మలయాళ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది.

ట్రెడిషనల్ లుక్‌లో సమంత సోయగాలు
సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. వెంకటగిరి చీరలో ఆమె చూపించిన హొయలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఫోటోలే కాకుండా, ఆ చీర వెనుక ఉన్న గొప్ప కథను కూడా ఆమె వివరించడం విశేషం. వెంకటగిరి నేత కార్మికులు ఎంతో నైపుణ్యంతో నేసారు. ఇది తరతరాల కళా నైపుణ్యానికి ప్రతీక. 'ఖుషి' తర్వాత సమంత రెండేళ్ల విరామం అనంతరం 'మా ఇంటి బంగారం' తో అలరించబోతోంది.