తెలంగాణ సత్తెమ్మకు కేటీఆర్ నివాళులు అర్పించారు. వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోశారు.
సంబంధిత వార్తలు

DANGER : చావుతో ఆట.. రైల్వే స్టేషన్‌లో హైడ్రామా
మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఒక యువకుడు 25 వేల వోల్టుల హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్‌చల్ చేశాడు. ఇది గమనించిన అధికారులు వెంటనే కరెంట్ సరఫరా నిలిపివేసి.. గంటన్నర పాటు శ్రమించి అతడిని సురక్షితంగా కిందికి దించారు. ఈ హైడ్రామా వల్ల మూడు రైళ్ల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆ యువకుడు మానసిక స్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

"భవన నిర్మాణ కార్మికులకు వరం.. మంత్రి వివేక్ వరాల జల్లు!"
* భవన నిర్మాణ కార్మికులకు త్వరలోనే పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. * ప్రతి జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల కోసం 'సంఘ భవనం' నిర్మిస్తామని తెలిపారు. * గతంలో ఉన్న ప్రమాద బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం ₹10 లక్షలకు పెంచిందని, దీని ద్వారా కార్మిక కుటుంబాలకు ఆర్థిక భద్రత లభిస్తుందని ఆయన గుర్తుచేశారు. * అర్హులైన ప్రతి కార్మికుడికి లేబర్ కార్డులు అందజేస్తామన్నారు

బ్లాక్ హోల్ సామర్థ్యం 10వేల సూర్యులతో సమానమా..??
తాజా రిపోర్ట్ లు అవుననే చెబుతున్నాయి. బ్లాక్ హోల్ దగ్గర ప్రయాణిస్తున్న కాంతిపుంజముల వేగము, కాంతి వేగం లో సగమే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడి నుంచి వెలువడే కాంతి... పదివేల సూర్యులు వెదజల్లే కాంతితో సమానం అని లెక్క గడుతున్నారు.

BREAKING: పవన్ ఆరోగ్యంపై చిరు అప్ డేట్
సర్జరీ తర్వాత పవన్ ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి ప్రకటించారు. పవన్ హెల్త్ బులిటెన్ వెల్లడించారు. మరో వారంలో సాధారణ పరిస్థితికి వస్తారని, ఎవరూ ఆందోళన చెందవద్దని చిరంజీవి సూచించారు
