
BREAKING: పవన్ ఆరోగ్యంపై చిరు అప్ డేట్
సర్జరీ తర్వాత పవన్ ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి ప్రకటించారు. పవన్ హెల్త్ బులిటెన్ వెల్లడించారు. మరో వారంలో సాధారణ పరిస్థితికి వస్తారని, ఎవరూ ఆందోళన చెందవద్దని చిరంజీవి సూచించారు
సంబంధిత వార్తలు

'వాలీ' మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన క్రిష్!
ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేతుల మీదుగా విడుదలైన ‘వాలీ’ చిత్ర మోషన్ పోస్టర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ తెరపై వాలీబాల్ క్రీడ నేపథ్యంలో వస్తున్న మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామాగా గుర్తింపు పొందిన ఈ చిత్రం, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. క్రిష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎల్బీ నగర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, బాచుపల్లి , మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడటంతో , ఎండ లతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల అకస్మాత్తుగ ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బాక్సాఫీస్ వద్ద 'వాళా 2' విధ్వంసం!
మలయాళ చిత్ర పరిశ్రమలో 'వాళా 2'బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో, సరికొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన 17 రోజుల్లోనే ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అతి తక్కువ కాలంలో ఈ మైలురాయిని చేరుకున్న మలయాళ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది.

జగనన్న కాలనీలో చొరబడ్డ చిరుత..
చిత్తూరు నగర నడిబొడ్డున చిరుతల సంచారం కలకలం రేపుతోంది. దొడ్డిపల్లిలోని జగనన్న లేఔట్‌లో మూడు రోజులుగా తిరుగుతున్న చిరుత గాయాలపాలై స్పృహ తప్పి పడిపోయింది. తిరుపతి నుంచి రావాల్సిన రెస్క్యూ బృందం కోసం అటవీ శాఖ ఎదురుచూస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పరిసరాలను ఖాళీ చేయించారు. చిరుతను చూసేందుకు ప్రజలుఎగబడ్డారు. మరోవైపు స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.