LIVE
Pk 1
వెనక్కి
General

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స..?

1 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం అధికారులతో సమావేశంలో ఉండగా అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షలు, ఎంఆర్ఐ అనంతరం శస్త్ర చికిత్స అవసరమని నిర్ణయించి శనివారం ఆపరేషన్ నిర్వహించారు. వారం నుంచి పది రోజులు విశ్రాంతి తర్వాత విధులకు హాజరవచ్చని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

షేర్ చేయండి:
18 ఏప్రిల్, 2026 07:51 PMకి

సంబంధిత వార్తలు

అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు అల్పాహారం..

అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు అల్పాహారం..

తన 76వ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌కు వచ్చారు. భార్య భువనేశ్వరితో కలిసి కొంత మంది పేదలకు బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. అనంతరం అక్కడే అల్ఫాహారం స్వీకరించారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ కు రూ.76 లక్షలను భువనేవ్వరి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. పేదల ఆకలి తీర్చే అవకాశం వచ్చినందుకు చంద్రబాబు దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

5 నిమిషాల క్రితం
మళ్లీ భగ్గుమన్న ముడి చమురు ధరలు

మళ్లీ భగ్గుమన్న ముడి చమురు ధరలు

హార్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 85.89 డాలర్లకు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర 90.13 డాలర్లకు చేరుకుంది. 2027 వరకు అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్‌కు 3 డాలర్ల పైన ఉండే అవకాశం ఉందని అమెరికా ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నారు.

5 నిమిషాల క్రితం
రూ. 35 కోట్లతో విడాకుల  సెటిల్‌మెంట్..?

రూ. 35 కోట్లతో విడాకుల సెటిల్‌మెంట్..?

తమిళ హీరో విజయ్‌-సంగీత విడాకులపై చెన్నైలో ఆసక్తికర టాక్స్ నడుస్తున్నాయి . పరస్పర అంగీకారంతో విడిపోవాలని ఇరు వర్గాలు లాయర్లతో శనివారం చర్చించినట్లు సమాచారం. విడాకుల పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. సెటిల్‌మెంట్‌గా రూ.250 కోట్లు కోరిన సంగీతకు, రూ.35 కోట్ల ఇవ్వటానికి విజయ్‌ అంగీకరించినట్లు తెలిసింది. పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని విజయ్‌ తెలిపినట్లు సమాచారం.

9 నిమిషాల క్రితం
విశాఖ నుంచి సింగపూర్‌కు జల విహారం..

విశాఖ నుంచి సింగపూర్‌కు జల విహారం..

విశాఖ నుంచి అంతర్జాతీయ క్రూజ్ షిప్ సేవలకు శ్రీకారం చుడుతున్నారు. జులై 15 నుంచి విశాఖ పోర్టు నుంచి క్రూజ్ ప్రయాణాలు ప్రారంభం కానున్నాయి. కార్డేలియా క్రూజ్ చెన్నై మీదుగా ఫుకెట్, లాంకావి, కౌలాలంపూర్, సింగపూర్ వరకు ప్రయాణించనుంది. 14 రోజుల ఈ పర్యటన పర్యాటకులను ఆకర్షించనుందని టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ వెల్లడించింది.

18 నిమిషాల క్రితం