డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. పవన్ అన్నా.. డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకోండి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆశ, శ్వాసగా పనిచేసే మీరు త్వరగా పూర్తి ఆరోగ్యంతో ప్రజా సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అని లోకేష్ తన సందేశంలో పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శనివారం సాయంత్రం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.
సంబంధిత వార్తలు

అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు అల్పాహారం..
తన 76వ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌కు వచ్చారు. భార్య భువనేశ్వరితో కలిసి కొంత మంది పేదలకు బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. అనంతరం అక్కడే అల్ఫాహారం స్వీకరించారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ కు రూ.76 లక్షలను భువనేవ్వరి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. పేదల ఆకలి తీర్చే అవకాశం వచ్చినందుకు చంద్రబాబు దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
.png)
మళ్లీ భగ్గుమన్న ముడి చమురు ధరలు
హార్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 85.89 డాలర్లకు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర 90.13 డాలర్లకు చేరుకుంది. 2027 వరకు అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్‌కు 3 డాలర్ల పైన ఉండే అవకాశం ఉందని అమెరికా ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నారు.

మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను తినవచా
మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను తినవచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పుచ్చకాయ యొక్క గ్లైసీమిక్ ఇండెక్స్ సుమారు 72. ఇది "ఎక్కువ"కేటగిరీలోకి వస్తుంది, ఇది చక్కెర స్థాయిలను పెంచగలదు. పుచ్చకాయను ఒకేసారి ఎక్కువగా తినకూడదు. ఒక చిన్న కప్పు ముక్కలను తీసుకోవడం సురక్షితం పుచ్చకాయను విడిగా తినడం కంటే, ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఉన్న బాదం, వాల్‌నట్స్ కలిపి తీసుకుంటే చక్కెర గ్రహించే వేగం తగ్గుతుంది.

రూ. 35 కోట్లతో విడాకుల సెటిల్‌మెంట్..?
తమిళ హీరో విజయ్-సంగీత విడాకులపై చెన్నైలో ఆసక్తికర టాక్స్ నడుస్తున్నాయి . పరస్పర అంగీకారంతో విడిపోవాలని ఇరు వర్గాలు లాయర్లతో శనివారం చర్చించినట్లు సమాచారం. విడాకుల పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. సెటిల్‌మెంట్‌గా రూ.250 కోట్లు కోరిన సంగీతకు, రూ.35 కోట్ల ఇవ్వటానికి విజయ్ అంగీకరించినట్లు తెలిసింది. పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని విజయ్ తెలిపినట్లు సమాచారం.
