రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ అందించే ప్రతిష్టాత్మక ‘హెర్మన్ బి వెల్స్’ అవార్డు-2026కు అన్షు ఎంపికయ్యారు. కుమార్తెకు విషెస్ చెబుతూ రోజా సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేశారు. "నీ కఠోర శ్రమ, అంకిత భావం, ధైర్యం కారణంగానే ఈ గౌరవం దక్కింది" అని పేర్కొన్నారు. విద్యారంగంలో అసాధారణ ప్రతిభ, లీడర్ షిప్, క్యాంపస్ కు చేసిన సేవకు గుర్తింపు ఇచ్చారు.
సంబంధిత వార్తలు

'నాగబంధం' నుంచి ఎనర్జిటిక్ 'సుర సుర' సాంగ్!
విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం 'నాగబంధం' నుండి సెకండ్ సింగిల్ 'సుర సుర' సాంగ్ లిరికల్ వీడియో నేడు విడుదలైంది. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ పాటలో విరాట్ కర్ణ తన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకోగా, నభా నటేష్ తన గ్లామర్‌తో అలరించింది.ఇప్పుడు 'సుర సుర' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

'వాలీ' మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన క్రిష్!
ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేతుల మీదుగా విడుదలైన ‘వాలీ’ చిత్ర మోషన్ పోస్టర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ తెరపై వాలీబాల్ క్రీడ నేపథ్యంలో వస్తున్న మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామాగా గుర్తింపు పొందిన ఈ చిత్రం, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. క్రిష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
మండుటెండల్లో గాలి దుమారం.. కుండపోత వర్షం..
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎల్బీ నగర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, బాచుపల్లి , మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడటంతో , ఎండ లతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల అకస్మాత్తుగ ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బాక్సాఫీస్ వద్ద 'వాళా 2' విధ్వంసం!
మలయాళ చిత్ర పరిశ్రమలో 'వాళా 2'బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో, సరికొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన 17 రోజుల్లోనే ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అతి తక్కువ కాలంలో ఈ మైలురాయిని చేరుకున్న మలయాళ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది.
