శ్రీరాముడిపై తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ‘ఇటీవల ఓ లిటరరీ ఫెస్టివల్‌లో నేను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు కావాలనే వక్రీకరించారు. అవతారపురుషుడైన శ్రీరాముడి గురించి నేను తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను గాయపరిచానని దుష్ప్రచారం చేస్తున్నారు. అన్ని ధర్మాలను ప్రేమించే నాకు ఆ అవసరం లేదు.
సంబంధిత వార్తలు

'వాలీ' మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన క్రిష్!
ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేతుల మీదుగా విడుదలైన ‘వాలీ’ చిత్ర మోషన్ పోస్టర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ తెరపై వాలీబాల్ క్రీడ నేపథ్యంలో వస్తున్న మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామాగా గుర్తింపు పొందిన ఈ చిత్రం, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. క్రిష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
బాక్సాఫీస్ వద్ద 'వాళా 2' విధ్వంసం!
మలయాళ చిత్ర పరిశ్రమలో 'వాళా 2'బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో, సరికొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన 17 రోజుల్లోనే ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అతి తక్కువ కాలంలో ఈ మైలురాయిని చేరుకున్న మలయాళ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది.

ట్రెడిషనల్ లుక్‌లో సమంత సోయగాలు
సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. వెంకటగిరి చీరలో ఆమె చూపించిన హొయలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఫోటోలే కాకుండా, ఆ చీర వెనుక ఉన్న గొప్ప కథను కూడా ఆమె వివరించడం విశేషం. వెంకటగిరి నేత కార్మికులు ఎంతో నైపుణ్యంతో నేసారు. ఇది తరతరాల కళా నైపుణ్యానికి ప్రతీక. 'ఖుషి' తర్వాత సమంత రెండేళ్ల విరామం అనంతరం 'మా ఇంటి బంగారం' తో అలరించబోతోంది.

పరశురామ్ పవర్‌ఫుల్ లుక్
ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే హొంబాలే ఫిలిమ్స్, పురాణ గాథలను యానిమేషన్ రూపంలో వెండితెరపై మరింత పవర్‌ఫ/ల్ గా హైలెట్ చేసే పనిలో ఉంది. దశావతారాల నేపథ్యంతో ఒక భారీ యానిమేషన్ సినిమాటిక్ యూనివర్స్‌ను ప్లాన్ చేశారు. ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదే సిరీస్ లో రెండో భాగంగా విష్ణుమూర్తి ఆరో అవతారమైన పరశురాముడి కథను సిద్ధం చేస్తున్నారు.
