
BANNED : అశ్వగంధ ఆకులపై కేంద్రం నిషేధం.. కారణమిదే!
ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్లలో అశ్వగంధ ఆకుల వాడకంపై కేంద్ర సంస్థ FSSAI పూర్తి నిషేధం విధించింది. ఈ ఆకుల్లో కాలేయానికి తీవ్ర హాని కలిగించే విథాపెరిన్-A అనే రసాయనం అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఆకులు కలిపిన ఉత్పత్తుల తయారీ, విక్రయం చట్టవిరుద్ధమని, మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఆ ఉత్పత్తులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ఇకపై కేవలం అశ్వగంధ వేర్లు, వాటి రసాన్ని మాత్రమే వినియోగించాలంది.
సంబంధిత వార్తలు

"భవన నిర్మాణ కార్మికులకు వరం.. మంత్రి వివేక్ వరాల జల్లు!"
* భవన నిర్మాణ కార్మికులకు త్వరలోనే పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. * ప్రతి జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల కోసం 'సంఘ భవనం' నిర్మిస్తామని తెలిపారు. * గతంలో ఉన్న ప్రమాద బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం ₹10 లక్షలకు పెంచిందని, దీని ద్వారా కార్మిక కుటుంబాలకు ఆర్థిక భద్రత లభిస్తుందని ఆయన గుర్తుచేశారు. * అర్హులైన ప్రతి కార్మికుడికి లేబర్ కార్డులు అందజేస్తామన్నారు

బ్లాక్ హోల్ సామర్థ్యం 10వేల సూర్యులతో సమానమా..??
తాజా రిపోర్ట్ లు అవుననే చెబుతున్నాయి. బ్లాక్ హోల్ దగ్గర ప్రయాణిస్తున్న కాంతిపుంజముల వేగము, కాంతి వేగం లో సగమే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడి నుంచి వెలువడే కాంతి... పదివేల సూర్యులు వెదజల్లే కాంతితో సమానం అని లెక్క గడుతున్నారు.

BREAKING: పవన్ ఆరోగ్యంపై చిరు అప్ డేట్
సర్జరీ తర్వాత పవన్ ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి ప్రకటించారు. పవన్ హెల్త్ బులిటెన్ వెల్లడించారు. మరో వారంలో సాధారణ పరిస్థితికి వస్తారని, ఎవరూ ఆందోళన చెందవద్దని చిరంజీవి సూచించారు

COOL WEATHER: హైదరాబాద్ ప్రజలకు ‘చల్లటి’ కబురు
హైదరాబాద్ ప్రజల కోసం చల్లని వార్త. భానుడి వేడిమికి అల్లాడుతున్న నగర ప్రజలకు త్వరలోనే ఉపశమనం కలగనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పు, ఉత్తర, పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. సిటీ సగం ప్రాంతాల్లో వర్షం పడటం వల్ల వేడి తగ్గి వాతావరణం కాస్త చల్లబడుతుంది.